సమ్మర్ వెకేషన్‌కు ఈ బీచ్ ప్రాంతాలు అద్భుతంగా ఉంటాయి,  ఒకసారి వెళ్లి రండి 

By Haritha Chappa
Apr 25, 2025

Hindustan Times
Telugu

వేసవి వస్తే ఎంతోమంది బీచ్ ఉన్న ప్రాంతాలకే వెళ్లాలనుకుంటారు. బీచ్ లోంచి వచ్చే చల్లని గాని అద్భుతంగా అనిపిస్తుంది. 

భారతదేశంలో అద్భుతమైన బీచుల జాబితా ఇక్కడ ఇచ్చాము. మీకు నచ్చిన బీచ్ కు ఈ సమ్మర్లో వెళ్లేందుకు ప్లాన్ చేయండి.

కర్ణాటక రాష్ట్రంలో అందమైన ప్రదేశాలలో గోకర్ణ ఒకటి. ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. బీచ్ స్వచ్ఛంగా ఉంటాయి.

అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న రాధానగర్ బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీన్ని స్వరాజ్‌ద్వీప్ బీచ్ అని పిలుస్తారు. నీలం రంగు నీళ్లు, మృదువైన తెల్లని ఇసుక మీకు ఆహ్లాదాన్ని పంచుతాయి. 

ఉత్తర గోవాలో ఉన్న పలోలేం బీచ్ కూడా అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రశాంతత, సహజ సౌందర్యం మనసును కట్టిపడేస్తుంది.

కేరళలో ఉన్న వర్కలా బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్ శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని పాపనాశం బీచ్ అని కూడా పిలుస్తారు.

చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయంత్రం వాకింగ్‌కు, గుర్రపు స్వారీలకు అందరూ మెరీనా బీచ్ కి వస్తారు.

గోవాలోని బాగా బీచ్ కూడా అందమైన ప్రదేశం. ఇక్కడికి వస్తే కొత్త ఉత్సాహాన్ని నింపుకొని వెళతారు. 

దక్షిణ గోవాలోనే మరో అందమైన బీచ్ అగోండా. ఇక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణం, తెల్లని ఇసుక మనసును అక్కడ నుంచి రాకుండా కట్టిపడేస్తాయి. 

కేరళలోని తిరువనంతపురానికి దగ్గరగా ఉండే కోవలం బీచ్ కూడా  అందంగా ఉంటుంది. అలలు ఇక్కడ అతి పెద్దగా కాకుండా సున్నితంగా వస్తాయి. దశాబ్దాలుగా పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. 

రామేశ్వరం దక్షిణకొనవద్ద ఉండే ధనుష్కోడి బీచ్ కూడా చూసేందుకు కనుల పండుగలా ఉంటుంది. ఇది సహజ సౌందర్యంతో నిండి ఉన్న ప్రదేశం. 

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels