ఫ్రిజ్ లో నిల్వ చేయకూడని కూరగాయలు ఇవే

Pixabay

By Haritha Chappa
May 20, 2025

Hindustan Times
Telugu

గుమ్మడికాయ, సొరకాయ వంటి కూరగాయలను ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదు.

Pixabay

టమోటాలను గది ఉష్ణోగ్రత వద్ద గాలి పీల్చేలా ఉంచడం మంచిది. ఫ్రిజ్ లో నిల్వ చేసినప్పుడు దాని నాణ్యత, రుచి తగ్గుతుంది.

Pixabay

సాధారణంగా ఉల్లిగడ్డలను గాలి వెదజల్లే ప్రదేశంలో ఉంచితే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. దీన్ని ఫ్రిజ్ లో పెడితే ఉల్లిపాయ మృదువుగా మారుతుంది. అందులో ఫంగస్ కూడా పెరుగుతుంది.

Pixabay

వంకాయను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల దాని రుచి తగ్గుతుంది. గది ఉష్ణోగ్రత అనేది వంకాయను ఉంచాల్సిన ప్రదేశం. 

Pixabay

వెల్లుల్లిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే మొలకెత్తుతుంది. వెల్లుల్లిని గది వాతావరణంలో ఉంచాలి. అప్పుడే అది ఎక్కువ కాలం అలాగే ఉంటుంది. 

బంగాళదుంపను ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచితే దాని తొక్క నల్లగా మారుతుంది. కాబట్టి వాటిని ఫ్రిజ్ లో పెట్టకండి.

Pixabay

ఎరుపు, ఆకుపచ్చ ల మిరపకాయలను ఫ్రిజ్ లో ఉంచకూడదు. 

Pixabay

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash