ఉదయం లేవగానే స్త్రీలు ఈ పనులు పొరపాటున కూడా చేయకూడదు 

pixabay

By Gunti Soundarya
Aug 21, 2024

Hindustan Times
Telugu

స్త్రీ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. ఇంటి ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని అంటారు. 

pixabay

ఇంటి ఆర్థిక పరిస్థితి, సంతోషం, శ్రేయస్సు వచ్చేలా చేయడంలో స్త్రీ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇంటి మహాలక్ష్మి చేసే పనులు కుటుంబం మీద ప్రభావం చూపుతాయి. 

pixabay

మహిళలు ఉదయాన్నే నిద్రలేచి ఈ పనులు చేస్తే నెగటివిటీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే వీటిని పొరపాటున కూడా చేయకూడదు. 

pixabay

ఉదయం నిద్రలేవగానే ఇంటి గుమ్మంలో కూర్చోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి వెళ్లిపోతుందట. 

pixabay

ఉదయం లేవగానే గొడవలు, వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. నిద్రలేవగానే ఏడవటం కుటుంబానికి మంచిది కాదు. 

pixabay

కొంతమంది నిద్రలేవగానే అద్దంలో చూసుకుంటారు. కానీ ఇది అసలు మంచిది కాదు. ఇలా చేస్తే నెగిటివిటీ ప్రవేశించడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. 

pixabay

ఉదయాన్నే నిద్రలేచి తమకు అదృష్టం దక్కలేదు, సౌకర్యాలు ఏమి లేవంటూ విధిని నిందించకూడదు. ఇలా చేస్తే ఆడవారికి మంచిది కాదు. 

pixabay

స్నానం చేయకుండా వంట గదిలోకి ప్రవేశించకూడదు. వంట గది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. 

pixabay

పొద్దున్నే నిద్రలేచి తల దువ్వుకుని, స్నానం ఆచరించి పనులు ప్రారంభించడం చాలా మంచిది. ఇలా ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ప్రీతిప్రాతమైనదిగా ఉంటుంది. 

pixabay

హాట్ షోతో అట్రాక్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటి దీప్తి సునైనా

Instagram