మహిళల్లో ఎక్కువగా వచ్చే ఏడు రకాల క్యాన్సర్లు ఇవే

Image Credits: Adobe Stock

By Haritha Chappa
Feb 04, 2025

Hindustan Times
Telugu

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణం, 2022 లో దాదాపు 10 మిలియన్ల మరణాలకు కారణమైంది. ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, మహిళల్లోఅధికంగా వస్తున్న 7 రకాల క్యాన్సర్ల గురించి తెలుసుకోండి.

Image Credits: Adobe Stock

ఊపిరితిత్తుల క్యాన్సర్

Image Credits: Adobe Stock

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఇది ప్రధానంగా ధూమపానం వల్ల సంభవిస్తుంది, కానీ ధూమపానం చేయనివారు కూడా దీని బారిన పడవచ్చు. నిరంతర దగ్గు, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గుతో పాటూ రక్తం పడడం, వివరించలేని బరువు తగ్గడం  వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Image Credits : Adobe Stock

అండాశయ క్యాన్సర్

Image Credits: Adobe Stock

అండాశయ క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు. దీనిని 'నిశ్శబ్ద క్యాన్సర్' అని పిలుస్తారు. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందే వరకు స్పష్టమైన లక్షణాలను చూపించదు. ప్రారంభ సంకేతాలలో ఉబ్బరం, కడుపు నొప్పి, ఆకలి లేదా బాత్రూమ్ అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి

Image Credits: Adobe Stock

రొమ్ము క్యాన్సర్

Image Credits: Adobe Stock

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి, సంవత్సరానికి 2.3 మిలియన్ల కేసులు నిర్ధారణ అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీని లక్షణాలు రొమ్ములో ముద్దలా అనిపించడం, రొమ్ము పరిమాణం, ఆకారంలో మార్పులు, రొమ్ముల దగ్గరి చర్మ మార్పులు, చనుమొనల నుంచి స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

Image Credits: Adobe Stock

గర్భాశయ క్యాన్సర్

Image Credits: Adobe Stock

గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఇది తరచుగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ వల్ల సంభవిస్తుంది. ప్రారంభ దశలో, ఇది ఎటువంటి లక్షణాలను కలిగించకపోవచ్చు. ఇది పెరుగుతున్న కొద్దీ, ఇది అసాధారణ రక్తస్రావం, కటి నొప్పిని కలిగిస్తుంది.

Image Credits: Adobe Stock

కొలొరెక్టల్ క్యాన్సర్ 

Image Credits: Adobe Stock

కొలొరెక్టల్ క్యాన్సర్ పెద్దప్రేగు లేదా పురీషనాళాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది సాధారణంగా కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది, ప్రేగు అలవాట్లలో మార్పులు, మలంలో రక్తం, కడుపు నొప్పి,  బరువు తగ్గడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. రెగ్యులర్ స్క్రీనింగ్లు దీనిని ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి.

Image Credits: Adobe Stock

ఎండోమెట్రియల్ క్యాన్సర్ 

Image Credits: Adobe Stock

ఎండోమెట్రియల్ క్యాన్సర్ గర్భాశయం పొరను ప్రభావితం చేస్తుంది. రుతువిరతి తర్వాత మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది. అసాధారణ యోని రక్తస్రావం, సెక్స్ సమయంలో నొప్పి, కటి నొప్పి. వయస్సుతో పాటు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Credits: Adobe Stock

చర్మ క్యాన్సర్

Image Credits: Adobe Stock

మెలనోమాతో సహా చర్మ క్యాన్సర్ అధిక సూర్యరశ్మి వల్ల వస్తుంది. ఇది నివారించదగిన క్యాన్సర్లలో ఒకటి. దీన్ని ప్రారంభంలోనే గుర్తించవచ్చు అని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. లక్షణాలలో దురద, రక్తస్రావం లేదా విస్తరణ వంటి పుట్టుమచ్చలలో మార్పులు ఉన్నాయి.

Image Credits: Adobe Stock

ప్రియమైన మహిళలారా, రొమ్ము క్యాన్సర్ నివారించడానికి ఈ 14 ఆహారాలు తీసుకోండి

ఇప్పుడు చదవండి

Image Credits: Adobe Stock

నోటికి రుచికరంగా ఉన్నాయని వీటిని ఎక్కువ తింటే- ఇక అంతే!

pexels