మడం దగ్గర అస్థి బంధనానికి, ఎముకకు మధ్య ఉండే సంచిలో ఇన్ఫెక్షన్ చేరడం వల్ల కానీ అస్థి బంధనంలో ఇన్ఫెక్షన్ చేరడం వల్ల, బరువు పెరగడం వల్ల, వయసు పెరగడం వల్ల, అస్థి బంధనాలు బలహీనం కావడం వల్ల కాలి మడమల్లో నొప్పి వస్తుంది.
30-40 ఏళ్లు వయసు దాటిన వారిలో మడమ నొప్పులు ఎక్కువ వస్తుంటాయి.స్థూలకాయం ఉన్న వారిలో మడమ నొప్పులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
నడివయసు దాటిన వారిలో వచ్చే కీళ్ల నొప్పుల్లో ఎక్కువగా అస్థి బంధనాల అరుగుదల వల్ల వస్తుంటాయి.
మడం శూల నొప్పిలో మడం అడుగున గానీ, వెనుక భాగంలో కానీ నొప్పి మొదలవుతుంది.
విశ్రాంతి తీసుకున్న తర్వాత, రాత్రంతా నిద్రపోయి ఉదయం లేచిన వెంటనే కాలు కింద పెట్టగానే మడమ విపరీతంగా నొప్పి వస్తుంది.
కాలు కింద పెట్టినా, లేచి నిలబడినా వెంటనే నొప్పి ఎక్కువగా ఉండి, నడుస్తున్న కొద్దీ క్రమేపి నొప్పి తగ్గుతుంది.కొంత దూరం నడిచిన తర్వాత కాలి మడమలో సర్దుబాటు జరిగి, నడక మామూలు స్థితికి చేరుతుంది.
కాలి మడమ నొప్పుల్లో చాలా వరకు కొంచెం నడక సాగగానే తగ్గిపోతుంది. సాధారణంగా మడమ నొప్పి రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుంది.
నొప్పి మరీ ఎక్కువగా ఉంటే నొప్పుల నివారణ మాత్రలు వాడాల్సి ఉంటుంది.
మడమల దగ్గర మెత్తగా ఉండే చెప్పులు తొడిగితే ఉపశమనం కలుగుతుంది.
అవసరానికి మించి బరువు ఉంటే, బరువు తగ్గడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
వేడినీళ్ల కాపడం పెట్టడం ద్వారా నొప్పి తగ్గుతుంది.
ఎత్తు మడమల చెప్పులతో కూడా కాళ్ల మడమల నొప్పులు వస్తుంటాయి.