గుండె జబ్బులకు ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం,తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్‌గా మారినపుడు దానిని శక్తిగా మార్చేందుకు పాంక్రియాస్ ఇన్సూలిన్ విడుదల చేస్తుంది.
By Bolleddu Sarath Chandra Dec 03, 2024
Hindustan Times Telugu
ఇన్సులిన్ గ్లూకోజ్‌ను శరరీ కణాల్లోకి పంపడంలో విఫలమైతే రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది
దీర్ఘకాలం పాటు ఇన్సులిన్ నిరోధకత కొనసాగితే అది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. డయాబెటిస్ గుండె సక్రమంగా పనిచేయడానికి తోడ్పడే నరాలు, రక్తనాళాలను దెబ్బ తీస్తుంది.
డయాబెటిస్ కారణంగా గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలు వాపుకు గురి చేసి గుండె జబ్బులకు కారణమవుతుంది.
మనం తీసుకునే ఆహారంలో కార్బో హైడ్రేట్స్, షుగర్ తగ్గించి ఎక్కువగా కొవ్వు పదార్ధాలను తినడం ద్వారా దీనిని అధిగమించవచ్చు.
ఈ పక్రియలో శరీరానికి కావాల్సిన శక్తి గ్లూకోజ్ నుంచి కాకుండా కొవ్వు పదార్ధాల నుంచి లభిస్తుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ సమతుల్యతను కాపాడుతుంది.
గ్లూకోజ్‌ను నియంత్రించగలిగితే డయాబెటిస్ క్రమంగా అదుపులోకి వచ్చేస్తుంది. తినే ఆహారం ద్వారా కూడా పూర్తిగా ఈ పద్ధతిలో గ్లూకోజ్ నియంత్రించి గుండెను కాపాడుకోవచ్చు.
శరీరానికి కావాల్సిన కొవ్వు పదార్ధాల కోసం గుడ్లు, చేపలు, మాంసం, నట్స్, ఛియాసీడ్స్, బక్‌వీట్, కినోవా వంటి వాటిని స్వీకరించవచ్చు.
కొవ్వుల కోసం మినుములు, శనగలు, కందిపప్పు వంటి వాటిని తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కొవ్వులు లభిస్తాయి.
డి విటమిన్ లోపం కూడా డయాబెటిస్‌కు, క్రమంగా గుండెపోటుకు దారి తీస్తుంది. ఉదయం పూట ఎండలో ఉండటం, డి, కె విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిమించవచ్చు.
గుండె నిరంతరం పనిచేసే కండరం, గుండెతో పాటు మెదడు, కాలేయాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. వాటికి ఎక్కువ శక్తి అవసరం ఉంటుంది. వయసు పెరిగే కొద్ది శరీరంలో ఈ శక్తిని అందించే కణాలు తగ్గిపోతాయి. ఇందుకోసం డయాబెటిస్ రోగులు గుండె రక్షణ కోసం అవసరమైన మందులు వాడాలి.
వ్యాయామం గుండెకు ఆరోగ్యాన్ని సమకూర్చే సాధనం. వ్యాధి నిరోధకత శరీరంలో డాక్టర్ల పాత్ర పోషిస్తే కుడికాలు,ఎడమ కాలు శరీరం వెలుపల ఉన్న వైద్యులుగా వ్యవహరిస్తాయి. వాటికి రోజుకు 45నిమిషాలు పని కల్పిస్తే సంపూర్ణ ఆరోగ్యం దక్కుతుంది.