డయాబెటిస్ వస్తే కనిపించే ప్రారంభ లక్షణాలు ఇవే

PEXELS

By Haritha Chappa
Jan 18, 2025

Hindustan Times
Telugu

మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. కాబట్టి దీని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. 

PEXELS

డయాబెటిస్ వల్ల కనిపించే ప్రారంభ లక్షణాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.

PEXELS

డయాబెటిస్ వస్తే చాలా దాహం వేస్తోంది. శరీరం నీటి కొరతను అధిగమించడానికి ప్రయత్నించడం వల్ల ఇది జరుగుతుంది. తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల దాహం ఎక్కువై పోతుంది.

PEXELS

రక్తంలో అధిక చక్కెర స్థాయిలు తరచుగా మూత్ర విసర్జనకు దారితీస్తాయి. ఇది ప్రధాన లక్షణాలలో ఒకటి. రాత్రిపూట మూత్రవిసర్జన కారణంగా మీరు తరచుగా లేవవలసి ఉంటుంది.  

PEXELS

డయాబెటిస్ వల్ల  మీకు చాలా బలహీనంగా అనిపిస్తుంది. అధిక అలసట లేదా మైకము సమస్య ఉండవచ్చు.  

PEXELS

ఆహారంలో మీరు ఎలాంటి మార్పులు చేయకపోయినా  అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం జరుగుతుంది. 

PEXELS

చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు  కంటిలోని ద్రవ స్థాయిల్లో మార్పులు కనిపిస్తాయి. ఇది అస్పష్టమైన దృష్టికి కారణం అవుతుంది.

PEXELS

మరిన్ని విజువల్ స్టోరీల కోసం క్లిక్ చేయండి

చిన్న పిల్లలకు హార్ట్ ఎటాక్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

Image Source From unsplash