స్మోకింగ్ చాలా ప్రమాదకరం. దీనివల్ల క్యాన్సర్లు, గుండె జబ్బుల్లాంటివి వస్తాయి. అయితే సిగరెట్ తాగడం మానేసిన తర్వాత శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి
pexels
By Hari Prasad S Feb 10, 2025
Hindustan Times Telugu
స్మోకింగ్ మానేసిన 8 గంటల తర్వాత శరీరంలో బీపీ తగ్గుతుంది. నికొటిన్, కార్బన్ మోనాక్సైడ్ సగానికి తగ్గిపోతాయి
pexels
స్మోకింగ్ మానేసిన 24 గంటల తర్వాత హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు తగ్గుతుంది. ఆక్సిజన్ కోసం గుండె ఎక్కువగా రక్తాన్ని పంప్ చేయాల్సిన అవసరం ఉండదు.
pexels
స్మోకింగ్ మానేసిన 48 గంటల తర్వాత ఊపిరి తిత్తుల్లోని నికొటిన్, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. నికొటిన్ పూర్తిగా తొలగిపోతుంది. అయితే కాస్త తలనొప్పి, అలసట అనిపిస్తుంది
pexels
స్మోకింగ్ మానేసిన రెండు వారాల నుంచి 3 నెలల మధ్య ఊపిరి తిత్తుల మరింత బలంగా మారతాయి. ఈ సమయంలో లంగ్స్ సాధారణంగా మారి, రక్త ప్రసరణ మెరగవుతుంది
pexels
స్మోకింగ్ మానేసిన ఏడాది తర్వాత గుండె జబ్బులు వచ్చే అవకాశం సగానికి తగ్గిపోతుంది
pexels
స్మోకింగ్ మానేసిన ఐదేళ్ల తర్వాత నోటి, అన్నవాహిక, బ్లాడర్, గొంతు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు సగానికి తగ్గిపోతాయి. ఇక స్ట్రోక్, సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు స్మోకింగ్ చేయనివాళ్లతో సమంగా ఉంటాయి
pexels
స్మోకింగ్ మానేసిన 15 ఏళ్ల తర్వాత శరీరం పూర్తిగా కోలుకుంటుంది. గుండెపోటు అవకాశాలు ఉండవు. అసలు జీవితంలో ఎప్పుడూ స్మోకింగ్ చేయలేదన్న స్థాయికి శరీరం చేరుకుంటుంది
pexels
డిన్నర్ తర్వాత కొంచెం సేపు నడిచినా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?