రోజువారీ  ఆహారంలో గుప్పెడు  తెల్ల శనగలు తీసుకుంటే మీ శరీరంలో ఏమి జరుగుతుంది అంటే..!

By Sarath Chandra.B
May 13, 2025

Hindustan Times
Telugu

రోజూ ఉడకబెట్టిన శనగలు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయి.. ఇతర ధాన్యాలతో పోలిస్తే శనగల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. 

ఉడికించిన శనగల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.కండరాల నిర్మాణానికి, కణజాలం మరమ్మతులు చేయడంతో పాటు  మొత్తం శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

శాఖాహారులకు శరీరానికి కావాల్సిన సంపూర్ణ పోషకాలు శనగల ద్వారా లభిస్తాయి.

 ఉడికించిన శనగల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. 

ఉడకబెట్టిన శనగలు జీర్ణక్రియలకు సహాయం చేస్తాయి. మలబద్దకాన్ని నిరోధిస్తాయి. 

జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యకరమైన బాక్టీరియాను పెంచడంలో  శనగలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఉడికించిన శనగల్లో తక్కువ గ్లైసిమిన్‌ ఇండెక్స్‌ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని తగ్గిస్తుంది.

ఉడికించిన శనగలు డయాబెటిస్‌ ఉన్న వారికి మంచి ఆహార ఎంపికగా ఉంటుంది. 

శనగల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ శక్తిని నెమ్మదిగా విడుదల చేయడానికి దోహదపడతాయి.

రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి శనగలు చక్కగా పనిచేస్తాయి. 

యాంటీ ఆక్సిడెంట్స్‌, మినరల్స్‌, ఫైబర్‌ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. 

రక్త ప్రసరణ మెరుగు పరిచి, రక్త నాళాలను శుభ్ర పరచడానికి తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి  శనగలు దోహదం చేస్తాయి.

శనగల్లో ఉండే ఇనుము, జింక్‌, విటమిన్స్‌ రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి.

శనగల్లో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నిషియం ఎముకల శక్తిని పెంచుతాయి.దంతాల ఆరోగ్యానికి కూడా సాయం చేస్తాయి.

రెడ్ డ్రెస్సులో బలగం హీరోయిన్ గ్లామర్ షో.. 2 సినిమాలతో కావ్య కళ్యాణ్ రామ్ బిజీ!