ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే  ప్రయోజనాలు ఇవే

By Haritha Chappa
May 16, 2025

Hindustan Times
Telugu

హిందూమతంలో మంత్రోచ్ఛారణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మంత్రాలు పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

ఈ మంత్రాలు మన శరీరానికి, మనస్సుకు శాంతిని ఇస్తాయి. ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేస్తాయి.

గ్రంధాలలో అనేక మంత్రాలను ప్రస్తావించారు. ఇందులో ఓం నమః శివాయ అనే మంత్రం ఒకటి.

ఓం నమః శివాయ ఒక శక్తివంతమైన మంత్రం.

ఈ మంత్రం మీ ఆత్మను శివుని దివ్య శక్తితో కలుపుతుందని నమ్ముతారు.

భక్తిశ్రద్ధలతో మంత్రాన్ని జపిస్తే వెంటనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు.

దీనితో పాటు ఈ మంత్రం మానసిక సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

ఈ మంత్రం మీ జీవితంలో శివుని ఆశీర్వాదాలను పెంచుతుంది.

గమనిక: ఇది ప్రబలంగా ఉన్న మత విశ్వాసం మీద ఆధారపడిన రచన. పాఠకులకు తెలియజేసే ఉద్దేశ్యంతో మాత్రమే ప్రచురించారు.

వాకింగ్ చేస్తున్నారా?.. నడిచేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

Image Credits : Adobe Stock