దొంగతనాలకు గురైన ఏడుగురు స్టార్ సెలబ్రిటీలు వీళ్లే!
Pinterest
By Sanjiv Kumar Jan 17, 2025
Hindustan Times Telugu
ధనవంతులు, ప్రసిద్ధి చెందిన వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇటీవల, సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వచ్చిన దొంగ కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. ఇలా దొంగతనాలను ఎదుర్కొన్న ఏడుగురు బాలీవుడ్ స్టార్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
Pinterest
సోనమ్ కపూర్ (2022): సోనమ్ కపూర్, తన భర్త ఆనంద్ అహుజా ఢిల్లీలో నివాసం ఉంటున్న ఇంట్లో రూ. 2.41 కోట్ల నగదు, నగలు అపహరణకు గురయ్యాయి. అనంతరం ఆ దోషులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Pinterest
ఇప్పుడే తెలుసుకోండి
అమితాబ్ బచ్చన్ (2013): అమితాబ్ బచ్చన్ నివాసం ఉంటున్న జల్సా ఇంట్లో రూ. 25,000 చోరీ జరిగింది. ఇందులో తన కుటుంబంలోని ఓ అంతర్గత వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానించి, ఒక విచారణను కోరారు.
Pinterest
పూనమ్ ధిల్లాన్ (2025): పూనమ్ ధిల్లాన్ ఖర్ నివాసంలో ఒక పెయింటర్ రూ. 1 లక్షకు పైగా విలువైన వజ్రాల నెక్లెస్, రూ. 35,000 నగదు, కొన్ని డాలర్లను తెరిచి ఉన్న కప్‌బోర్డ్ నుండి దొంగిలించాడు.
Pinterest
శిల్పా శెట్టి (2015): శిల్పా శెట్టి సెలవులో ఉన్నప్పుడు, దొంగలు ఆమె జుహు బంగ్లాలో 25 అడుగుల గోడ ఎక్కి నగలు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు.
Pinterest
హేమ మాలిని (2010): హేమ మాలిని గోరేగావ్ బంగ్లాలోకి ప్రవేశించిన దొంగలు రూ. 80 లక్షల నగదు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఈ కేసు చాలా కాలం పాటు పరిష్కారం కాలేదు.
Pinterest
ఏక్తా కపూర్ (2012): ఏక్తా కపూర్ జుహులోని బంగ్లాలో ఓ దొంగ చోరీకి యత్నించాడు. ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలిస్తూ ఎక్తా కపూర్ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు.
Pinterest
రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!