బ్లడ్ ప్రెజర్ (బీపీ) అధికంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. బీపీ ఎప్పుడూ కంట్రోల్‍లో ఉండాలి. ఇందుకు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. బీపీ కంట్రోల్‍లో ఉండేందుకు సహకరించే ఐదు రకాల కూరగాయలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
బంగాళదుంపల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇవి తింటే బ్లడ్ ప్రెజర్ తగ్గేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
బీట్‍రూట్ శరీరానికి నైట్రేట్ అందిస్తాయి. దీనివల్ల రక్తనాళాలకు మేలు జరుగుతుంది. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండేలా సహకరిస్తుంది.
Photo: Pexels
పాలకూర, బచ్చలి, క్యాబేజ్, కొల్లార్డ్స్, కేల్ లాంటి ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. బీపీ కంట్రోల్‍లో ఉండేందుకు ఇవి కూడా తోడ్పడతాయి.
Photo: Pexels
టమాటోల్లో పొటాషియం, లిక్టోపిన్ అధికంగా ఉంటాయి. అందుకే ఇవి కూడా బీపీని తగ్గించగలవు. ఇవి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
Photo: Pexels
బ్రకోలీలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం సహా చాలా విటమిన్లు కూడా ఉంటాయి. మీ ఆహారంలో దీన్ని తినడం వల్ల కూడా బీపీ నియంత్రణకు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? 9 ఆసక్తికరమైన విషయాలు