మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ పెరగాలా?.. ఇవి ట్రై చేయండి!
pexels
By Sudarshan V May 13, 2025
Hindustan Times Telugu
విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాదించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. చాలామంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో నాలెడ్జ్ ఉన్నా రాణించలేకపోతున్నారు.
pexels
కమ్యూనికకేషన్ స్కిల్స్ ను పెంచే కొన్ని చిట్కాలు, ఆ స్కిల్స్ పెంపొందించేందుకు ఉపయోగపడే 5 యాప్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
pexels
వినడం: శ్రద్ధగా వినడం అనేది సమర్థవంతమైన కమ్యూనికేషన్ యొక్క ప్రాథమిక అంశం. మీతో మాట్లాడే వారు చెప్పేది శ్రద్ధగా, కళ్లల్లోకి చూస్తూ వినండి.
pexels
మీ ఆలోచనలను సరళంగా, స్పష్టంగా వ్యక్తీకరించడం ప్రాక్టీస్ చేయండి. సరళమైన భాషను ఉపయోగించండి. సంక్లిష్టమైన పదజాలానికి దూరంగా ఉండండి.
pexels
బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, హావభావాలు, స్వరం వంటి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ పై శ్రద్ధ పెట్టండి. సరైన దూరం పాటించండి. ఐ కాంటాక్ట్ కలిగి ఉండండి.
pexels
కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడడానికి రెగ్యులర్ ప్రాక్టీస్ అవసరం. మిత్రులతో మాట్లాడండి. ఫీడ్ బ్యాక్ తీసుకోండి. అద్దం ముందు మాట్లాడండి.
Pixabay
మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో మీకు సహాయపడే ఐదు యాప్స్ ఇక్కడ ఉన్నాయి.
Pixabay
ఓఆర్ఏఐ: ఇది స్పీకింగ్ స్కిల్స్ ను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్. ఇది స్పీచ్ అనాలిసిస్, రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్ అందిస్తుంది.
pexels
స్పీకింగ్ పాల్: ఇంగ్లిష్ నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించే భాషా అభ్యాస వేదిక. ఇంగ్లిష్ ను సహజంగా మాట్లాడటం ప్రాక్టీస్ చేయడానికి సహాయపడుతుంది.
pexels
ఇంటరాక్టివ్ మరియు డైనమిక్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ ద్వారా అనర్గళంగా మాట్లాడటానికి ఉద్దేశించిన భాషా అభ్యాస పద్ధతి ఇది.
pexels
స్పీకో: ఇది వాయిస్ శిక్షణ, వ్యక్తీకరణ ద్వారా కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి రూపొందించిన యాప్.
Pixabay
ఎల్ఎస్ఏ: ఇది 'ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్'. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్.
pexels
యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి