ఇమ్యూనిటీతో పాటు మెరుగైన జీర్ణక్రియ - మసాలా టీ లాభాలివే..!
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jul 12, 2024
Hindustan Times Telugu
దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, కుంకుమపువ్వు , అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు కలుపుకొని మసాలా టీ తాగితే జీవక్రియ రేటుతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
image credit to unsplash
ఒక కప్పు మసాలా టీ మీ శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని అందించి, ఎముకలు కొరికే చలిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
image credit to unsplash
మసాలా టీ యాంటీ-డయాబెటిక్ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది; ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
మసాల టీలోని మూలికలు మీ జీవక్రియను సహజంగా పునరుద్ధరించడంలో సహాయపడతాయి.
image credit to unsplash
షుగర్ వ్యాధి ఉన్నవారికి, హృదయ ఆరోగ్యానికి మసాలా టీ బెస్ట్ అని చెప్పవచ్చు.
image credit to unsplash
మసాలా టీలలో కేలరీలు తక్కువగా ఉన్నా పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారు మసాలా టీలో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. అలా చేయడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
image credit to unsplash
మసాలా టీ మన శరీరానికి వెచ్చదనం, నాలుకకు రుచిని అందించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.
image credit to unsplash
గుమ్మడికాయ గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మీకు తెలిస్తే మీరు కచ్చితంగా విత్తనాలను పడేయరు.