రక్తదానం చేయడం వల్ల  మీకెన్నో ప్రయోజనాలు

pixabay

By Haritha Chappa
Feb 11, 2025

Hindustan Times
Telugu

రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడుతామని తెలిసిన విషయమే. అలాగే రక్తదానం వల్ల రక్తదాతకు కూడా  ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

రక్తదానం చేసేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది

దానాలలో ఉత్తమమైన దానం రక్తదానం అని చెబుతారు. కాబట్టి దీన్ని చేయడం వల్ల సంతృప్తి కలుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది

రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

రక్తదానం చేసేటప్పుడు మనసులో తలెత్తే ప్రతికూల ఆలోచనలను తగ్గించడానికి సహాయపడుతుంది

ఒంటరితనంలో ఉన్నవారికి దాని నుండి బయటపడటానికి ఉత్తమ మార్గాలలో రక్తదానం ఒకటి.

రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అదనపు ఇనుము పదార్థాలు బయటకు పోవడానికి సహాయపడుతుంది. దీనివల్ల అనేక శరీర అవయవాల పనితీరు సక్రమంగా ఉంటుంది

ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది

ఐఐటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన టాప్ సీఈవోలు

Photo Credit: AP