పెసరపప్పు ఎందుకు తినాలి?

By Haritha Chappa
Apr 05, 2024

Hindustan Times
Telugu

పెసరపప్పు కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో ఒకటి. 

మనశరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఇందులో ఉంాయి. ప్రొటీన్ దీనిలో పుష్కలంగా ఉంటుంది.

పెసరపప్పును వారం రోజుల్లో కనీసం రెండు నుంచి మూడు సార్లు తినడం చాలా ముఖ్యం. 

డయాబెటిస్ ఉన్న వారు పెసరపప్పును తినాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి పెసరపప్పు చాలా అవసరం. జీర్ణ క్రియ సవ్యంగా సాగాలంటే పెసరపప్పుతో చేసిన వంటకాలు తింటూ ఉండండి. 

బరువు తగ్గాలనుకునే వారు పెసరపప్పును మెనూలో చేర్చుకోవాలి. ఇది ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది

మానసిక ఆరోగ్యం కోసం పెసరపప్పు చాలా అవసరం. ఒత్తిడితో ఉన్నవారు పెసరపప్పు తింటే ఆ ఒత్తిడి తగ్గుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పెసరపప్పు ఎంతో ఉపయోగ పడుతుంది. మొలకెత్తిన పెసర్లు రోజూ తింటే ఎన్నో రకాల రోగాలు రాకుండా ఉంటాయి.

రాత్రివేళ ఈ ఆహారాలు తింటే ఊబకాయం పెరిగే రిస్క్

Photo: Pexels