మధు మేహ నియంత్రణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. 

By Bolleddu Sarath Chandra
Feb 02, 2025

Hindustan Times
Telugu

మధుమేహం ఉందని తెలియగానే ఏమి తినాలో, ఎలా తినాలనే దానిపై   ఆందోళన చెందుతారు.

డయాబెటిస్‌ ఉన్నవారు అన్ని రకాల రుచికరమైన ఆహారాలను త్యాగం చేయాలనేది నిజం కాదు.

డయాబెటిక్‌ డైట్ అంటే సమతుల్యమైన, రుచికరమైన, వైవిధ్యమైన, ఆరోగ్యవంతమైన ఆహారం

డయాబెటిస్‌లో మొత్తం మీద  కెలోరీలు తక్కువగా ఉండటం, గ్లూకోజ్‌ను పెంచే పిండి పదార్ధాలను మానేసి,ఎక్కువ పీచు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకోవడం కీలకం.

ఆహారంలో అధిక క్యాలరీలు ఉంటే అది ఊబకాయానికి దారి తీసి, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ పెంచి జెనిటిక్‌ అవకాశమున్న మనుషుల్లో డయాబెటిస్‌ వచ్చేలా చేస్తాయి. 

ఫాస్ట్‌ఫుడ్స్‌, కూల్‌ డ్రింక్స్‌, శరీరంలో కొవ్వుపెరగడం, వ్యాయామం లేకపోతే డయాబెటిస్‌ రావడానికి కారణం అవుతాయి.

ఎక్కువ పీచు పదార్ధాలు, తక్కువ కొవ్వు ఉన్న పదార్ధాలు టైప్‌ 2 డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి. 

క్రమం తప్పకుండా చేపలు తినేవారిలో డయాబెటిస్‌, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 

శరీరంలో గ్లూకోజ్‌ నియంత్రణలో ఉంటే డయాబెటిస్‌ వల్ల దుష్పలితాలను నియంత్రించవచ్చు. 

రక్తంలో కొవ్వు శాతం నియంత్రణలో ఉంటే రక్తనాళాల వాపును నియంత్రించ వచ్చు. 

మధుమేహంలో ఆహార నియంత్రణను వయసు, ఆహార అలవాట్లు,  ఆపరేషన్లు, మూత్రపిండాలు, కాలేయం పనితీరును బట్టి నిర్ణయించాలి. 

తీసుకునే ఆహారంలో 40-60 శాతం కెలోరీలు పిండి పదార్ధాలు  నుంచి 30శాతం ప్రొటీనుల నుంచి,  30శాతంకెలోరీల కొవ్వు పదార్దాల నుంచి ఉండాలి. 

పిండి పదార్ధాలు శరీరానికి శక్తినిచ్చే వాటిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పిండి పదార్ధాల వినియోగం తగ్గించడం ద్వారా మధుమేహ నియంత్రణ సులభంగా సాధించవచ్చు. 

బ్లాక్‌ కరెంట్స్‌ను కాసిస్ అని అంటారు. చాలా మంది నల్లద్రాక్ష అని పిలుస్తారు. కానీ నల్ల ద్రాక్ష, బ్లాక్ కరెంట్ వేర్వేరు రకాల పండ్లు.

Unsplash