పోలీసులకు చెమటలు పట్టించే సీరియల్​ కిల్లర్​- అదిరిపోయే ట్విస్ట్​లు.. ఓటీటీలో ది బెస్ట్​ క్రైమ్​, డిటెక్టివ్​ థ్రిల్లర్​ ఇది!

By Sharath Chitturi
Jun 16, 2025

Hindustan Times
Telugu

క్రైమ్​, ఇన్వెస్టిగేటివ్​ థ్రిల్లర్లు చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వారికి 'ది మెంటలిస్ట్'​ బాగా నచ్చుతుంది.

pexels

ఐఎండీబీ 8.2 రేటింగ్​ ఇచ్చిన ది మెంటలిస్ట్ అనే ఇంగ్లీష్​ సిరీస్​ని అమెజాన్​ ప్రైమ్​లో​ చూడొచ్చు. మొత్తం 7 సీజన్లు ఉన్నాయి.

కాలిఫోర్నియా బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​లో కన్సల్టెంట్​గా పని చేసే పాట్రిక్​ జేన్​ అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది.

పాట్రిక్​ జేన్​ తన అబ్జర్వేషనల్​ స్కిల్స్​, హ్యూమ్​ సైక్​పై జ్ఞానంతో కేసులు సాల్వ్​ చేస్తుంటాడు.

అయితే రెడ్​ జాన్​ అనే సీరియల్​ కిల్లర్​ జేన్​ భార్య, కూతురిని చంపేస్తాడు. అతడిని పట్టుకునేందుకు జేన్​ సీబీఐలో చేరుతాడు.

రెడ్​ జాన్​ చాలా తెలివైన కిల్లర్​. అతనికి చాలా కనెక్షన్స్​ ఉంటాయి. జేన్​తో పాటు మొత్తం పోలీసు వ్యవస్థను పరిగెత్తిస్తాడు.

pexels

మరి జేన్​ రెడ్​ జాన్​ని పట్టుకున్నాడా? అసలు ఈ రెడ్​ జాన్​ ఎవరు? అన్నది సిరీస్​లో చూడాల్సిందే!

pexels

అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..

pexels