రోజూ బంగాళాదుంపలు తినడం వల్ల కలిగే 5 దుష్ప్రభావాలు
pexels
By Bandaru Satyaprasad Mar 16, 2025
Hindustan Times Telugu
బంగాళాదుంపలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. వాటిని అధికంగా తీసకోవడం హానికరం. ప్రతి రోజూ బంగాళాదుంపలు తినడం వల్ల కలిగే 5 చెడు ప్రభావాలను తెలుసుకుందాం.
pexels
అధిక బ్లడ్ షుగర్ - బంగాళాదుంపలలో కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణవుతాయి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పొటాటోస్ తింటే లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు చిప్స్ వంటివి తింటే డయాబెటిస్ ఉన్న వారికి లేదా ఈ ప్రమాదంలో ఉన్న వారికి హానికరం.
pexels
బరువు పెరుగుదల - బంగాళాదుంపలలో కెలరీలు అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరగవచ్చు. ముఖ్యంగా వేయించిన లేదా వెన్న, చీజ్ లేదా ఇతర అధిక కేలరీల టాపింగ్స్ తో తిన్నా బరువు పెరగవచ్చు.
pexels
జీర్ణ సమస్యలు - బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్ లేదా అజీర్ణం ఏర్పడవచ్చు. దీనికి ప్రధాన కారణం వీటిలో స్టార్ట్ అధికంగా ఉండటం. బంగాళాదుంపలను అధికంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.
pexels
పోషక అసమతుల్యత- బంగాళాదుంపలను అధికంగా తీసుకోవడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. వీటిలో కొన్ని విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, వీటిలో ప్రోటీన్, కొవ్వులు, మొత్తం ఆరోగ్యానికి అవసరమైన కొన్ని విటమిన్లు వంటి పోషకాలు లేవు.
pexels
అధిక రక్తపోటు - ముఖ్యంగా వేయించిన బంగాళాదుంపలను తినడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. వేయించిన బంగాళాదుంపలతో ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు సోడియం స్థాయిలను పెంచుతాయి. ఇది కాలక్రమేణా రక్తపోటుకు దారితీస్తుంది.
pexels
బంగాళాదుంపలు ఎలా తినాలి? - పొట్టు తీయని బంగాళాదుంపలను తినడం మంచిది. బంగాళాదుంపలను వేయించడం కంటే కాల్చడం, ఉడకబెట్టడం ఉత్తమం. ఆలు మితంగా తినాలి. ఆకుపచ్చ బంగాళాదుంపలను తినకూడదు. ఇవి హానికరం.
pexels
ప్రొటీన్ సహజంగా అందించే కూరగాయలు
అధిక ప్రొటీన్ అందించే మీకు తెలియని ఆరు కూరగాయలు ఇవే