పింక్ డ్రెస్‍లో ప్రణవి గ్లామరస్ లుక్: ఫొటోలు

By Chatakonda Krishna Prakash
Apr 29, 2025

Hindustan Times
Telugu

నటి ప్రణవి మానుకొండకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువే. బాలనటి నుంచి హీరోయిన్‍గా ఎదిగిన ఈ బ్యూటీ తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా అట్రాక్టివ్ ఫొటోలు పంచుకున్నారు.

Photo: Instagram

పింక్ డ్రెస్‍లో ఎలిగెంట్ లుక్‍లో కనిపించారు ప్రణవి. గ్లాసెస్ పెట్టుకొని క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చారు. గ్లామరస్‍గా అదరగొట్టారు. 

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు (ఏప్రిల్ 29) షేర్ చేశారు ప్రణవి. బటర్ ఫ్లై, లవ్ సింబల్ ఎమోజీలను క్యాప్షన్‍గా పెట్టారు ఈ బ్యూటీ. 

Photo: Instagram

బాలనటిగా కెరీర్ మొదలుపెట్టారు ప్రణవి. రొటీన్ లవ్ స్టోరీ, ఉయ్యాల జంపాల లాంటి చిత్రాల్లో బాలనటిగా కనిపించారు. ఆ తర్వాత టిక్‍టాక్, డబ్ స్మాష్ ద్వారా మంచి ఫాలోయింగ్ సాధించారు.

Photo: Instagram

సూర్యవంశం, ఎవరే నువ్వు మోహినీ, గంగ మంగ సహా మరిన్ని టీవీ సీరియళ్లలోనూ ప్రణవి మానుకొండ నటించారు. బాగా పాపులర్ అయ్యారు. 

Photo: Instagram

2023లో వచ్చిన 'స్లమ్ డాగ్ హజ్బెండ్' సినిమాలో హీరోయిన్‍గా చేశారు ప్రణవి మానుకొండ. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్‍కు జోడీగా ఈ చిత్రంలో నటించారు ఈ భామ.   

Photo: Instagram

రెడ్ కార్పెట్‌పై ఊర్వ‌శి రౌటేలా.. బ్లాక్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌

Photo: Instagram