హైదరాబాద్ నుంచి అరుణాచలం ట్రిప్ - మార్చి నెల టూర్ ప్యాకేజీ ఇదే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Feb 07, 2025
Hindustan Times Telugu
అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది.
image credit to unsplash
4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు.
image credit to unsplash
నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. మార్చి నెలలో చూస్తే 11వ తేదీన ట్రిప్ అందుబాటులో ఉంది.
image credit to unsplash
ఈ ప్యాకేజీలో భాగంగా కాణిపాకంతో పాటు అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. వేలూరుతో పాటు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది.
image credit to Twitter
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ను సందర్శించాలి.
image credit to Twitter
హైదరాబాద్ అరుణాచలం ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 8 వేలుగా, పిల్లలకు రూ. 6400గా ఉంది.
image credit to unsplash
హైదరాబాద్ - అరుణాచంల టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.