వీకెండ్ లో పాపికొండలకు వెళ్లొద్దామా..! తక్కువ ధరలోనే 3 రోజుల టూర్ ప్యాకేజీ 

By Maheshwaram Mahendra Chary
May 24, 2024

Hindustan Times
Telugu

  పాపికొండల చూసేందుకు తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

image credit to unsplash

  హైదరాబాద్ నుంచి ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. రాత్రి 07.30 గంటలకు హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి బస్సు బయల్దేరుతుంది. రాత్రి భద్రాచలం వెళ్తారు.  

photo credit to twitter

రెండో రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హారిత హోటల్ కు చేరుకుంటారు. 8 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్ కు చేరుకొని.. పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. పొచారానికి బోట్ లో జర్నీ ఉంటుంది.

image credit to unsplash

మూడో రోజు బ్రేక్ ఫాస్ చేసిన తర్వాత… పర్ణశాలకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత… హైదరాబాద్ కు బయల్దేరుతారు. రాత్రి 10గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.

image credit to unsplash

హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు 6999గా నిర్ణయించారు. పిల్లలకు 5599గా ఉంది. 

image credit to unsplash

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 1800-425-46464 నెంబర్ కు కాల్ చేయవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

image credit to unsplash

https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు

image credit to unsplash

పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని కూడా నివారించగలవు

Pixabay