ముగిసిన మూల్యాంకనం - ఈ తేదీలోపే తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Apr 16, 2025
Hindustan Times Telugu
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయింది. ప్రస్తుతం క్రోడీకరణ జరుగుతోంది.
image credit to unsplash
తెలంగాణ ఇంటర్ స్పాట్ పూర్తి కాగా... ప్రస్తుతం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)లో ప్రాసెస్ జరుగుతుంది.
image credit to unsplash
గత ఏడాదిలో చూస్తే తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటించారు. అయితే ఈసారి కూడా ఏప్రిల్ 24 లేదా ఆలోపే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.
image credit to unsplash
తెలంగాణ ఇంటర్ బోర్డు వర్గాల ప్రకారం... ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 24 తేదీల మధ్య ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
image credit to unsplash
మార్చి 5 నుండి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,532 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో4,88,448 మంది ఫస్ట్ ఇయర్, 5,08,253 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.
image credit to unsplash
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో హాజరైన అభ్యర్థులంతా ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.
image credit to unsplash
తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలను https://telugu.hindustantimes.com వెబ్ సైట్ తో పాటు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లోనూ చెక్ చేసుకోవచ్చు.