దంతాలు పసుపుగా ఉంటే మీరు ఎదుటి వారితో మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు. మీ ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడుతుంది. ఈ ఏడు ఇంటి చిట్కాలతో దంతాలను తెల్లగా చేసుకోవచ్చు.   

pexels

By Bandaru Satyaprasad
Jan 21, 2025

Hindustan Times
Telugu

బేకింగ్ సోడా, నిమ్మరసం - బేకింగ్ సోడా, నిమ్మరసం పేస్ట్ గా చేసి దంతాలు పసుపుగా ఉన్నచోట అప్లై చేయండి. సున్నితంగా స్క్రబ్ చేయండి. ఈ చిట్కాను ఎక్కువగా ఉపయోగించవద్దు. నిమ్మరసంలోని ఆమ్లత్వంతో పంటిలోని ఎనామెల్ బలహీనపడే అవకాశం ఉంది.  

pexels

కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్- ఆయిల్ పుల్లింగ్ ఆయుర్వేద టెక్నిక్. ఇది నోటిలోని క్రిములు, దంతాలపై పసుపు మరకలను తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ కొబ్బరి నూనెను 10-15 ని. పాటు ఆయిల్ పుల్లింగ్ చేయండి.   

pexels

ఆపిల్ సైడర్ వెనిగర్ - ఆపిల్ సైడర్ వెనిగర్ లోని ఆమ్లత్వం దంతాల పసుపు మరకలను తొలగించే సామర్థ్యం కలిగి ఉంటుంది. 1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను గ్లాస్ నీటిలో కరిగించి, సుమారు 30 సెకన్ల పాటు నోటిలో పుక్కలించండి. అనంతరం సాధారణ నీటితో నోటిని శుభ్రం చేసుకోండి.  

pexels

చార్ కోల్ స్క్రబ్ - యాక్టివేటెడ్ చార్ కోల్ దంతాలపై నున్న పసుపు మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. దంతాలు తెల్లగా అయ్యేందుకు సహజ నివారణ. బొగ్గు పొడితో 2 నిమిషాల పాటు బ్రష్ చేయండి. వారానికి 1, 2 సార్లు ఈ పద్ధతిని ఉపయోగించండి.  

pexels

స్ట్రాబెర్రీస్, బేకింగ్ సోడా - స్ట్రాబెర్రీలలో యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల పసుపును తొలగించడంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీని మెత్తగా చేసి, అర టీస్పూన్ బేకింగ్ సోడాతో కలిపి పేస్ట్ లా చేసి దంతాలకు అప్లై చేసి 5 నిమిషాలు ఉంచండి.  

pexels

హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా - హైడ్రోజన్ పెరాక్సైడ్ దంతాలను తెల్లగా చేసేందుకు  సహాయపడుతుంది. బేకింగ్ సోడాతో కలిపినప్పుడు పసుపు మరకలను తొలగించడానికి సహాపడుతుంది. బేకింగ్ సోడాలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పేస్ట్ లా  చేసి 2 నిమిషాలు బ్రష్ చేయండి.  

pexels

కరకరలాడే కూరగాయాలు - ఆపిల్, క్యారెట్ వంటి క్రంచీ పండ్లు, కూరగాయలు సహాజ టూత్ బ్రష్ లుగా పనిచేస్తాయి. దంతాలను శుభ్రపరిచే లాలాజల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ ఆహార కణాలు, ఉపరితల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.  

pexels

ఉదయం నిద్రలేవగానే కొన్ని చిన్న అలవాట్లు మీ మెదడుకు శక్తిని ఇస్తాయి. శరీరంలాగే మెదడుకు కొద్దిగా వార్మప్ అవసరం. మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడే 9 ఉదయపు చిట్కాలు పాటించండి.  

pexels