దంతాల సెన్సిటివిటీ కొన్నిసార్లు చాలా అసౌకర్యాన్ని, నొప్పిని కలిగిస్తాయి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడంతో పాటు నోటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు 9 చిట్కాలు తెలుసుకుందాం. 

pexels

By Bandaru Satyaprasad
May 28, 2024

Hindustan Times
Telugu

టూత్ పేస్ట్ - సున్నితమైన దంతాల కోసం సరైన టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి. ఈ టూత్ పేస్ట్ నరాల చివరలను డీసెన్సిటైజింగ్ చేయడం వల్ల అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. పొటాషియం నైట్రేట్ లేదా స్ట్రోంటియం క్లోరైడ్ పదార్థాలను కలిగి ఉన్న టూత్ పేస్ట్ ను ఉపయోగించండి.  

pexels

మృదువైన బ్రిస్టల్ కలిగిన టూత్ బ్రష్ - హార్డ్ బ్రిస్టల్ బ్రష్ లు ఎనామెల్ ను తొలగించి, డెంటిన్ పొరను బయటపెట్టి సున్నితత్వాన్ని మరింత పెంచుతాయి. అందుకే మృదువైన బ్రిస్టల్క కలిగిన టూత్ బ్రష్ ను ఎంచుకోండి.  

pexels

బ్రషింగ్ టెక్నిక్ - వృత్తాకార కదలికతో సున్నితంగా బ్రష్ చేయండి. బలంగా బ్రష్ చేయడం నివారించండి. బలంగా బ్రష్ చేస్తే ఎనామెల్ కోతకు, చిగుళ్ల అరుగుదలకు కారణం అవుతుంది. దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది.  

pexels

ఫ్లాస్ చేయండి - రోజు వారీ ఫ్లాసింగ్ దంతాల మధ్య ఆహార కణాలను తొలగించడానికి సాయపడుతుంది. దంతక్షయం, చిగుళ్ల వ్యాధిని నివారిస్తుంది.  

pexels

ఫ్లోరైడ్ మౌత్ వాష్ - ఎనామెల్ ను బలోపేతం చేయడానికి సున్నితత్వాన్ని తగ్గించేందుకు బ్రష్ చేసిన తర్వాత ఫ్లోరైడ్ మౌత్ వాష్ చేయండి. ఫ్లోరైడ్ దంతాలను రీమినరలైజ్ చేస్తుంది.  

pexels

యాసిడ్ ఫుడ్స్ మానుకోండి - సిట్రస్ పండ్లు, సోడా, వైన్ వంటి యాసిడ్ ఫుడ్స్, పానీయాలు దంతాలపై ఎనామెల్ ను డ్యామేజ్ చేస్తుంది. ఈ ఆహారాలను పరిమితం చేయడం మంచిది.  

pexels

ఉప్పు నీటితో పుక్కలించడం - సున్నితమైన దంతాలు, చిగుళ్ల సమస్యలకు ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఉప్పునీరు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.  

pexels

ఆయిల్ పుల్లింగ్ - మీ నోటి ఆరోగ్యానికి ఆయిల్ పుల్లింగ్ మీ దినచర్యలో చేర్చుకోండి. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను నోటిలో 10-15 నిమిషాల పాటు స్విప్ చేయడం వల్ల బ్యాక్టీరియా, పళ్ల వాపు తగ్గుతుంది.  

pexels

నైట్ గార్డ్ - రాత్రి పూట మీ దంతాల సెన్సిటివిటీ ఇబ్బంది పెడితే నైట్ గార్డ్ పెట్టుకోండి. ఇది ఎనామెల్ కోతను నివారిస్తుంది.  

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels