సీరియల్ హీరోయిన్ అశ్లీల వీడియో వైరల్.. మీ తల్లివి, చెల్లివి చూడమంటూ శ్రుతి ఫైర్

By Sanjiv Kumar
Mar 29, 2025

Hindustan Times
Telugu

 ప్రముఖ సీరియల్ నటి శ్రుతి నారాయణన్ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె పరోక్షంగా దీనిని ఏఐ వీడియోగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియోపై శ్రుతి స్పందించింది.

"ముఖ్యంగా ఇది నాకు చాలా కష్టమైన కాలం. దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నేనూ స్త్రీనే. నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. నా చుట్టుపక్కల వాళ్లకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి" అని శ్రుతి తెలిపింది.

"మీరు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఆ వీడియోను దావానలంలా వ్యాప్తి చేయకండి" అని శ్రుతి నారాయణన్ కోరింది.

"మీ అమ్మ, చెల్లి, గర్ల్ ఫ్రెండ్ కూడా మహిళలే. వాళ్లకు నాలాగే శరీరాలు ఉంటాయి. కావాలనుకుంటే వారి వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి" అని శ్రుతి నారాయణన్ ఫైర్ అయింది.

'ఇది మనిషి జీవితానికి సంబంధించినది. ఇది అభిరుచి కాదు. ఆ కామెంట్స్ చూస్తే నన్ను దోషిగా నిందిస్తున్నారు. కానీ, నేను ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను" అని శ్రుతి అన్నారు. 

"ఈ వీడియోను ఎందుకు పోస్ట్ చేశారు? ఎవరు చూశారనే ప్రశ్నలు ఎందుకు వేయలేదు? ఇది కేవలం వీడియో మాత్రమే కాదు. ఇది ఒకరి మానసిక ఆరోగ్యం, జీవితం! అందులో ఇరుక్కుపోతే అది నీ సమస్యే" అని శ్రుతి ఎమోషనల్‌గా కోట్ రాసుకొచ్చింది.

కాగా గత కొన్నిరోజులుగా శ్రుతి నారాయణన్ శృంగార వీడియో అంటూ నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది ఏఐతో చేసిన వీడియో అని పరోక్షంగా ఆన్సర్ ఇచ్చింది శ్రుతి. ఇక శ్రుతి నారాయణన్ తమిళంలో పాపులర్ నటి. సిరగదిక్క అసాయి సీరియల్‌తో శ్రుతి ఫేమస్ అయింది.

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels