స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. ఆటపాటలతో పిల్లలు ఇంట్లో సందడి చేస్తుంటారు. అయితే వేసవిలో పిల్లల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎండలు, వేడి వాతావరణం పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వేసవిలో పిల్లల అనారోగ్యం బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.
pexels
By Bandaru Satyaprasad Apr 26, 2025
Hindustan Times Telugu
గాలిలో ఉండే హానికరమైన కాలుష్య కారకాలు, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన UV కిరణాలు, వేడి, ఉక్కపోత వల్ల కలిగే చెమట మొదలైన కారణాలతో పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎండాకాలంలో మీ పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
pexels
వేసవిలో పిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యలు
pexels
జీర్ణ సమస్యలు - కలుషిత ఆహారం తినడం లేదా కలుషిత పానీయాలు తాగడం వలన జీర్ణకోశ సమస్యలు కలుగుతాయి. దీంతో పిల్లలు కడుపునొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శుభ్రత లేని కలుషిత ఆహారం తీసుకుంటే వాటిలోని వైరస్‌లు, ఇతర టాక్సిన్‌ల వలన పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.
pexels
డీ హైడ్రేషన్ - ఆటల్లో పడి పిల్లలు నీరు తాగటం మరచిపోతారు, ఎండలో తిరగటం వలన డీహైడ్రేషన్‌కు గురవుతారు. వేసవిలో పిల్లలు తరచూ నీరు తాగేలా వారి వద్ద ఎల్లప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచండి. పుచ్చకాయలు తినిపించడం, పండ్ల రసాలు ఇవ్వడం, హైడ్రేషన్ పెంచే డ్రింక్స్ అందిస్తూ ఉండాలి.
pexels
చర్మ సమస్యలు - వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల చెమట అధికంగా పడుతుంది. దీంతో పిల్లల్లో చర్మ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఒళ్లు పేలిపోవడం, తామర వంటి సమస్య తీవ్రమవుతుంది. చెమట ఎక్కువగా పట్టడం వల్ల దురద దద్దుర్లు ఏర్పడతాయి. చెమటకాయలు, చర్మం కమిలిపోవడం జరగవచ్చు.
pexels
పిల్లలకు ఎక్కువ చెమట పట్టినప్పుడు శుభ్రమైన గుడ్డతో తుడవడానికి ప్రయత్నించండి. తేలికపాటి కాటన్ దుస్తులు వేయండి. డాక్టర్ సిఫార్సు చేసిన మాయిశ్చరైజర్ క్రీమ్స్ లేదా లోషన్లు ఉపయోగించండి. UV కిరణాల నుంచి రక్షణ కోసం సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి.
pexels
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఎండలో తిరగనివ్వకుండా చూడండి. సాయంత్రం వేళ, లేదా ఉదయం పూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బయట ఆడుకోవడానికి అనుమతివ్వండి. పిల్లల రోగనిరోధక శక్తిని పెంచేందుకు సరైన పౌష్టికాహారం ఇవ్వండి.
pexels
ఎండాకాలంలో దోమలు, ఇతర కీటకాల కాటుకు పిల్లలు గురయ్యే అవకాశం ఉంది. దోమకాటుతో దురద, వాపు కలుగుతుంది. వైద్యుల సూచనతో పిల్లల కోసం ప్రత్యేకమైన దోమల నివారణ మందులను వాడేందుకు ప్రయత్నించండి.
pexels
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.