వేసవిలో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఎండ వేడిమి, ఉక్కపోత, తీవ్రమైన UV కిరణాల ప్రభావం చర్మానికి కఠినంగా అనిపించవచ్చు. ఎండ వేడిని తట్టుకోవడానికి 10 చర్మ సంరక్షణ చిట్కాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Apr 27, 2025

Hindustan Times
Telugu

పుష్కలంగా నీరు తాగండి - వేసవిలో నీరు పుష్కలంగా తాగాలి. చర్మా్న్ని ప్రకాశవంతంగా ఉంచుకోవడానికి హైడ్రేషన్ ముఖ్యం. నీరు విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.  

pexels

ముఖాన్ని శుభ్రం చేసుకోండి- వేసవి చెమట, బయటకు వెళ్తే దుమ్ము, ధూళి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. మురికి, ఆయిల్ ను తొలగించడానికి, పగుళ్లను నివారించడానికి ఉదయం, రాత్రి పడుకునే ముందు మీ చర్మాన్ని శుభ్రం చేసుకోండి.   

pexels

సన్ స్క్రీన్ అప్లై చేయండి - వేసవిలో సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుంచి రక్షణ అవసరం. మీరు బయటకు వెళ్లినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయండి. యూవీ కిరణాల నుంచి సురక్షితంగా ఉండడానికి ఎస్పీఎఫ్ ఉన్న క్రీమ్ లను ఉపయోగించండి.  

pexels

మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయండి- వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్ ఫోలియేట్ చేయండి. ఇది మృత చర్మ కణాలను తొలగిస్తుంది.  ఇలా చేస్తే తాజా, మెరుస్తున్న చర్మం మీ సొంతం.  

pexels

తేమ - వేసవిలో కూడా చర్మానికి తేమ అవసరం. మీ చర్మాన్ని జిడ్డుగా లేకుండా హైడ్రేటెడ్ గా ఉంచడానికి తేలికైన, నూనె లేని మాయిశ్చరైజర్ ను ఎంచుకోండి. 

pexels

నీరు అధికంగా ఉండే పండ్లు తినండి - పుచ్చకాయ, కీరదోస, నారింజ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మీ చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేయడానికి ఇవి సహాయపడతాయి.    

pexels

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలు తినండి - బెర్రీస్, సిట్రస్ పండ్లు, ఆకుకూరల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని వేడి నుంచి రక్షిస్తాయి. చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా కాపాడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.  

pexels

చల్లటి నీటితో స్నానం - చన్నీటితో స్నానం ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. రోజుకు రెండు సార్లు షవర్ చేస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.   

pexels

సీరం షీట్ మాస్క్ - షీట్ మాస్క్ మీ చర్మంలో హైడ్రేషన్ పెంచి, తాజాగా ఉంచుతుంది. హైలురానిక్ యాసిక్ వంటి హైడ్రేటింగ్ పదార్థాలు ఉన్న వాటిని ఎంచుకోండి.   

pexels

బాగా నిద్రపోండి - చర్మ సంరక్షణకు సరైన నిద్ర అవసరం. రాత్రుళ్లు 7-9 గంటలు నిద్రపోతే చర్మం పునరుత్పత్తికి చెందడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సహాపడుతుంది.   

pexels

అధిక యూరిక్ యాసిడ్ ఇటీవలి కాలంలో ఒక సాధారణ పరిస్థితి. కొన్నిసార్లు అది పెరిగితే ఇంటి నివారణలు లేదా చికిత్స అవసరం కావచ్చు.

Unsplash