అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేక వ్యాధులకు దారితీస్తాయి. ఒకప్పుడు బలహీనమైన ఎముకలు వృద్ధులను మాత్రమే వేధించేవి.

Unsplash

By Anand Sai
Jan 01, 2025

Hindustan Times
Telugu

ప్రస్తుతం యువత కూడా పాదాలు, వెన్ను, కీళ్లు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ ఎముకలను బలోపేతం చేయాలి. సరైన ఆహారాన్ని తీసుకోవాలి.

Unsplash

కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి.

Unsplash

గుడ్డులోని పచ్చసొన ఎముకలు దృఢంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ డి, విటమిన్ కె వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి.

Unsplash

బచ్చలికూరలో కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకల సాంద్రతను బలపరుస్తుంది. ఇది బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో కూడా సహాయపడుతుంది.

Unsplash

పాలకూరను స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది మీ ఎముకలు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పాలకూరను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

Unsplash

రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలలో విటమిన్ డి ఉంటుంది, ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది.

Unsplash

బిజీ లైఫ్ స్టైల్, అసమతుల్య ఆహారం ఎముకలలో సమస్యను పెంచుతుంది. క్యాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎముకలను బలపరుస్తుంది.

Unsplash

నిద్ర మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన స్లీప్ పొజిషన్ లు తీవ్రమైన అనారోగ్యాలను మెరుగుపరచడం, నివారించడంలో సహాయపడతాయి.  

pexels