మెంతికూరతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 06, 2023

Hindustan Times
Telugu

మెంతులు హెయిర్ ఫోలికల్స్‌కు పోషణను అందిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. 

image credit to unsplash

జుట్టు రాలడాన్ని నివారించడంలో మెంతులు బాగా పని చేస్తాయి. ఇది చుండ్రును, జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది. 

image credit to unsplash

మెంతుల్లో ఉండే ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్ జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు నిగనిగలాడేలా, పొడవుగా మార్చడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

నానబెట్టిన మెంతి గింజలను మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మెంతుల పేస్ట్‌ని తలకు, జుట్టుకు బాగా పట్టించాలి. అరగంట సేపు మీ జుట్టు మీద మెంతికూర పేస్ట్ ఉంచండి. ఆ తరువాత షాంపూ పెట్టండి.

image credit to unsplash

మెంతికూర గింజలను నీళ్లలో కాసేపు మరిగించి వడకట్టాలి. మీరు ఈ నీటిని చల్లబరచవచ్చు. వీటిని మీ జుట్టును కడగడానికి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

image credit to unsplash

మెంతి పొడిని పుల్లటి పెరుగుతో కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో తల కడగితే చుండ్రు సమస్య తగ్గుతుంది.

image credit to unsplash

 4-6 వారాల పాటు ఈ పనులను చేస్తే జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.హెయిర్ రూట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కొత్త జుట్టు పెరుగుతుంది. 

image credit to unsplash

విటమిన్ బీ 12 లోపం ఈ మధ్య చాలా మందిలో కనిపిస్తోంది.

pixabay