ఎంత నీరు తాగినా దాహంగా అనిపిస్తోందా! ఇవి తీసుకోండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Apr 01, 2025
Hindustan Times Telugu
వేడి తీవ్రంగా ఉండే వేసవికాలంలో తరచూ దాహం అవుతుంటుంది. ఒక్కోసారి నీరు ఎంత తాగినా దాహంగా అనిపిస్తూనే ఉంటుంది. డీహైడ్రేషన్ ఫీలింగ్ ఉంటుంది. దాహం తీవ్రంగా అవుతుంటే కొన్ని ఫుడ్స్ ఉపయోగపడతాయి.
Photo: Pexels
కొన్ని రకాల ఆహారాలు దాహం తీరేందుకు సహకరిస్తాయి. శరీరానికి నీటిని బాగా అందిస్తాయి. నీరు తాగినా దాహం తీరకపోతే ఈ ఫుడ్స్ తీసుకోవచ్చు. అలాంటి ఐదు ఆహారాల గురించి ఇక్కడ చూడండి.
Photo: Pexels
కీరదోసలో నీరు దాదాపు 95శాతం ఉంటుంది. నీరు తాగినా దాహం తీరకపోతే కీరదోస తినడం చాలా మేలు. హైడ్రేషన్ పెంచి దాహాన్ని ఇది తగ్గించగలదు.
Photo: Pexels
పుచ్చకాయలోనూ నీరు అత్యధికంగా ఉంటుంది. అందుకే ఈ పండు దాహాన్ని మెరుగ్గా తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనాన్ని అందించి, నీటిశాతం పెంచుతుంది.
Photo: Pexels
టమాటాల్లోనూ నీరు 95శాతం వరకు ఉంటుంది. ఇవి తిన్నా దాహం తగ్గేందుకు తోడ్పడతాయి.
Photo: Pexels
అతిగా దాహం వేస్తుంటే నారింజ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‍బెర్రీలు కూడా ఉపయోపడతాయి. ఈ పండ్లలో నీటి శాతం, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి హైడ్రేషన్ బాగా అందించగలవు.
Photo: Pexels
కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్ మెండుగా ఉంటాయి. తరచూ ఎక్కువగా దాహం అవుతుంటే ఈ నీరు చాలా మంచి ఆప్షన్. కొబ్బరినీళ్లు బాడీకి చల్లదనాన్ని, శక్తిని కూడా అందిస్తుంది.
Photo: Pexels
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?