నయం కాని మొండి దగ్గుకు నీటి ఆవిరితో పరిష్కారం......
By Sarath Chandra.B Mar 18, 2025
Hindustan Times Telugu
వైద్యం చేస్తున్నా దగ్గు తగ్గకపోతే నీటి ఆవిరితో చక్కటి పరిష్కారం లభిస్తుంది.
నీళ్లను బాగా మరిగించి ఆవిరి బయటకు వచ్చే సమయంలో ఆవిరిని నోటి ద్వారా పీల్చడం ద్వారా శ్వాస మెరుగవుతుంది.
ముక్కు దిబ్బడ తగ్గడానికి, బ్రాంకైటిస్, న్యూమోనియా, ఫ్లూ మొదలైన సందర్భాల్లో ఆవిరి పీల్చడం ద్వారా ముక్కు నుంచి ఊపిరి తిత్తుల్లో పేరుకున్న కళ్లె మెత్తబడుతుంది.
శ్వాసకు ఆటంకం కలిగించే కళ్లె అడ్డు తొలగిస్తే శ్వాసనాళాలు ఫ్రీగా తయారవుతాయి.
వేడి నీళ్ల పాత్రపై దుప్పటి వేసుకుని ఆవిరిపట్టడం ద్వారా పెద్దగా ఉపయోగం ఉండదు.
ఆవిరి ముక్కు రంద్రాలకు చేరడం ద్వారా శ్వాస సమస్యలు పరిష్కారం అవుతాయి. నోటితో నీటి ఆవిరిని పీల్చడం, ముక్కుతో వదలడం ఐదు నిమిషాల పాటు చేస్తే శ్వాస సమస్యలు తగ్గుతాయి.
ఆవిరి పీల్చడం పూర్తైన తర్వాత గట్టిగా దగ్గి కళ్లెను బయటకు ఊయాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయాలి.
దగ్గు మందు పనిచేయని సందర్భాల్లో కూడా ఆవిరి వైద్యం పనిచేస్తుంది.
మరిగే నీటిలో టించర్ బెంజాయిన్, జామాయిల్ చుక్కలుు, జండూబామ్ వంటివి కూడా శ్వాస సమస్యల్ని మెరుగు పరుస్తాయి.
నీటి ఆవిరితో చిక్కగా మారిన కళ్లె పలచగా మారుతుంది.
గొంతులో అడ్డుగా ఉన్న కళ్లెను బయటకు పోయేలా చేస్తే దగ్గు తగ్గిపోతుంది.
మొండి దగ్గులకు కూడా ఆవిరి వైద్యం చక్కగా ఉపయోగపడుతుంది. మందుల అవసరం లేకుండానే ఆవిరి వైద్యంతో జలుబు దగ్గును తగ్గించుకోవచ్చు.
ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు చాలా మందికి నోటి ద్వారా గాలి పీల్చే అలవాటు ఉంటుంది.