తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఏసీల వాడకం విపరీతంగా పెరిగింది. తీవ్రమైన వేడిని ఎదుర్కోవడానికి చాలా మంది ఎయిర్ కండిషనర్‌పై ఆధారపడుతున్నారు.   

pexels

By Bandaru Satyaprasad
Apr 30, 2025

Hindustan Times
Telugu

ఏసీ అధికంగా ఉపయోగించడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువగా ఏసీ వాడటం వల్ల చర్మం, జుట్టు, ముక్కు, గొంతులో తేమ తగ్గుతుంది. శ్లేష్మ పొరలను ఎండిపోయేలా చేస్తుంది. అధికంగా ఏసీ ఉపయోగించడం వల్ల కలిగే 7 దుష్ప్రభావాలు తెలుసుకుందాం.  

pexels

పొడి చర్మం- ఏసీలో ఎక్కువ సమయం గడపడం వలన  చర్మం పొడిబారుతుంది. మీ చర్మంలోని తేమ శాతం తగ్గి దురదగా అనిపిస్తుంది. 

pexels

కళ్లు పొడిబారడం- కంప్యూటర్లు, లాప్ టాప్ స్క్రీన్లలపై ఎక్కువ సమయం పనిచేసేవాళ్లకు కళ్లు పొడిబారతాయి. ఇలాంటి వారు ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. కళ్ల దురద, చికాకు పెరుగుతుంది.  

pexels

స్కిన్ ఆయిల్ ఉత్పత్తి- ఏసీలో అధికంగా గడపడం వలన చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గుతుంది, దీంతో చర్మం డీహైడ్రేషన్ చెందుతుంది. 

pexels

చర్మ సమస్యలు - ఏసీ నుంచి వచ్చే పొడి గాలికి ఎక్కువసేపు గురికావడం వల్ల తామర, రోసేసియా, సోరియాసిస్ మొదలైన చర్మ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. 

pexels

అకాల వృద్ధాప్యం- చర్మం తేమను కోల్పోవడంతో ముడుచుకుపోవడం ప్రారంభమవుతుంది. చర్మం సాగే లక్షణాలు తగ్గుతాయి, దీంతో ముడతలు, సన్నని గీతలు ఏర్పడతాయి. 

pexels

జుట్టు దెబ్బతినడం-ఏసీ... జుట్టును రక్షించే సహజ నూనెలను తొలగిస్తుంది. దీని వలన జుట్టు పొడిగా, పెలుసుగా మారి విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

pexels

అలెర్జీలు, అంటు వ్యాధులు- ఎయిర్ కండిషనింగ్... దుమ్ము, బూజు వంటి అలెర్జీ కారకాలకు కేంద్రాలుగా మారవచ్చు. ఈ అలెర్జీ కారకాలు గాలిలో విస్తరిస్తాయి, దీని వలన చర్మం దద్దుర్లు, ఉర్టికేరియా, చర్మ అలెర్జీ మొదలైన పరిస్థితులకు దారితీస్తాయి. 

pexels

ఏసీ ఉన్న గదులలో డీహైడ్రేషన్ రేట్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏసీ ఉపయోగిస్తున్నప్పుడు హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. మీ చర్మం, కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ నుండి విరామం తీసుకొని తరచూ నీళ్లు తాగడం అవసరం.  

pexels

30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?

Photo Credit: Pexels