సౌత్ ఇండియాలోని 6 బెస్ట్ హిల్ స్టేషన్లలో న్యూ ఇయర్ 2025కి స్వాగతం పలకండి
pexels
By Bandaru Satyaprasad Dec 29, 2024
Hindustan Times Telugu
2025 నూతన సంవత్సరం వేడుకలను ప్రకృతి ఒడిలో జరుపుకోవాలని భావిస్తున్నారా? అయితే సౌత్ ఇండియాలోని ఈ బెస్ట్ హిల్ స్టేషన్లు మీ కోసం వేచిచూస్తున్నాయి. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రెట్ చేసుకోండి.
pexels
పొన్ముడి, కేరళ - పొన్ముడి హిల్ స్టేషన్ సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఆస్వాదించడానికి అద్భుత ప్రదేశం. ఇక్కడ కల్లార్ మీన్‌ముట్టి జలపాతం, పొన్ముడి హిల్ టాప్, పొన్ముడి కొండ, పెప్పర వన్యప్రాణుల అభయారణ్యం, బ్రేమోర్ వాటర్ ఫాల్స్ సందర్శించవచ్చు.
అరకు లోయ, ఆంధ్రప్రదేశ్ - విశాఖలో సమీపంలోని అరకు లోయ ప్రకృతి అందాలకు అద్భుత ప్రదేశం. ఈ హిల్ స్టేషన్ సమీపంలో కటికి, తాడిమడ జలపాతాలు, బొర్రా గుహలు, భీమిలి బీచ్, చాపరాయి జలపాతాలు, గిరిజన మ్యూజియం టూరిస్ట్ ప్రదేశాలు.
pexels
కొడైకెనాల్, తమిళనాడు - కొడైకెనాల్ చుట్టూ దట్టమైన అడవులు, లోయలు, జలపాతాలు, సరస్సులతో సుందరంగా ఉంటుంది. 2025 నూతన సంవత్సరాన్ని మీ భాగస్వామితో కలిసి గడిపేందుకు బెస్ట్ ప్లేస్. ఇక్కడ కొడైకెనాల్ సరస్సు, డాల్ఫిన్స్ నోస్, తలైయార్ జలపాతం, మన్నవనూర్, డెవిల్స్ కిచెన్, బేర్ షోలా జలపాతం, వట్టకనాల్ ప్రదేశాలను సందర్శించవచ్చు.
pexels
కూర్గ్, కర్ణాటక- కూర్గ్ సుందరమైన బీచ్ లకు చక్కటి ప్రదేశం. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలలో అబ్బే జలపాతం, బైలకుప్పే, దుబరే ఎలిఫెంట్ క్యాంప్, పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నాయి.
pexels
మున్నార్, కేరళ - చుట్టూ టీ ఎస్టేట్‌లతో పచ్చటి ప్రకృతి దృశ్యాలతో మున్నార్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. టాటా టీ మ్యూజియం, కొలుక్కుమలై టీ ఎస్టేట్, అట్టుకల్ జలపాతాలు, మట్టుపెట్టి డ్యామ్, కుండలా సరస్సులో షికారా బోట్ రైడ్, బ్లోసమ్ పార్క్‌లో సైక్లింగ్ తో న్యూ ఇయర్ ను ఆస్వాదించవచ్చు.
pexels
ఊటీ, తమిళనాడు - ఊటీని 'ది క్వీన్ ఆఫ్ హిల్స్' అని పిలుస్తారు. సుందరమైన ప్రకృతి దృశ్యాలు కొత్త ఏడాది ప్రారంభించడానికి నూతనుత్తేజం కలిగిస్తాయి. ఊటీ సరస్సు, అవలాంచి సరస్సు, ఎమరాల్డ్ లేక్, డీర్ పార్క్, కల్హట్టి వాటర్ ఫాల్స్, ముకుర్తి నేషనల్ పార్క్ ఇక్కడ తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు.
pexels
గుండె జబ్బుల్లో మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు గుర్తించడం ఎలా...