రిపబ్లిక్ డే గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవిగో 

By Haritha Chappa
Jan 24, 2025

Hindustan Times
Telugu

రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు, భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చినందుకు గౌరవప్రదంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. 

1935 నాటి బ్రిటిష్ వలస ప్రభుత్వ చట్టం స్థానంలో రాజ్యాంగం దేశ పరిపాలన వచ్చింది. 

భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. 

1950లో మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో రిపబ్లిక్ డే ప్రారంభ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో 100కు పైగా విమానాలు, 3 వేల మంది భారత సైనికులు పాల్గొన్నారు.

భారత తొలి రిపబ్లిక్ డే పరేడ్ కు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో గౌరవ అతిథిగా హాజరయ్యారు.

రాజ్ పథ్ లో సంప్రదాయబద్ధంగా పరేడ్ నిర్వహిస్తారు. ఒకప్పుడు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం ముహమ్మద్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

బీటింగ్ రిట్రీట్ వేడుక మూలాలు 1600 ల సంప్రదాయంలో ఉన్నాయి. ప్రతి ఏటా జనవరి 29న ఢిల్లీలోని విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ నిర్వహిస్తారు. 

2025 రిపబ్లిక్ డే థీమ్ 'సువర్ణ భారత్: హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్'

2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, చండీగఢ్, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ సహా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన టాబ్లోలు డ్యూటీ పరేడ్లో పాల్గొంటాయి.

2025 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

Canva

ప్రేమికులే కాదు.. ఫ్యామిలీతో కలిసి చూసే ఓటీటీ సినిమాలు.. వాలంటైన్స్ డే స్పెషల్!