కూల్ డింక్స్ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కూల్ డ్రింక్స్ తాగొద్దనడానికి 8 కారణాలు తెలుసుకుందాం.

pexels

By Bandaru Satyaprasad
Jan 04, 2025

Hindustan Times
Telugu

అధిక చక్కెర కంటెంట్ - కూల్ డ్రింక్స్ లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఇది బరువు పెరగడాని, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. 

pexels

కిడ్నీలో రాళ్ల ప్రమాదం - సాఫ్ట్ డ్రింక్స్ లో అధికంగా ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. 

pexels

అధిక కేలరీలు - కూల్ డ్రింక్ అధిక కేలరీలు, తక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి. పోషకాహార లోపాలకు దారితీస్తాయి.  

pexels

గుండె జబ్బుల ప్రమాదం - కూల్ డ్రింక్స్ క్రమం తప్పకుండా తాగడం వల్ల గుండె సంబంధ సమస్యలు పెరుగుతాయి.  

pexels

టైప్ 2 డయాబెటిస్ రిస్క్ - శీతల పానీయాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  

pexels

దంతాలపై ప్రభావం - కూల్ డ్రింక్స్ లో యాసిడ్స్, షుగర్స్ ఉంటాయి. ఇవి దంతాలలోని ఎనామిల్ ను క్షీణించేలా చేస్తాయి. దీంతో కావిటీస్, చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది.  

pexels

ఎముకల ఆరోగ్యంపై ప్రభావం - శీతల పానీయాలలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్... బోలు ఎముకల వ్యాధి, ఎముక పగుళ్ల ప్రమాదానికి దోహదపడుతుంది.  

pexels

మానసిక స్థితిపై ప్రభావం - కూల్ డ్రింక్స్ రక్తంలో షుగర్ స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. దీంతో మానసిక ఆందోళన, చిరాకు, అలసటకు దారితీస్తుంది.  

pexels

నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం. 

pexels