నెట్‌ఫ్లిక్స్ లో పాపులర్ అవుతున్న వెబ్ సిరీస్ "అడాలసెన్స్" టీనేజర్లు, వారి మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం గురించి చర్చకు దారితీసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్ మీడియా ప్రభావాల నుంచి రక్షించుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం. 

pexels

By Bandaru Satyaprasad
Apr 15, 2025

Hindustan Times
Telugu

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ “అడాలసెన్స్” లో జామీ మిల్లర్(ఓవెన్ కూపర్) అనే బాలుడు ఒక టీనేజ్ అమ్మాయిని హత్య చేశాడనే అభియోగాలు ఎదుర్కొంటాడు. ఈ కేసు దర్యాప్తు, బాలుడి అరెస్టు, కుటుంబంపై ప్రభావాన్ని ఈ వెబ్ సిరీస్ చూపారు. ఈ వెబ్ సిరీస్ ముఖ్యంగా టీనేజర్లపై సోషల్ మీడియా ఒత్తిడిని, వారి మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూపించారు.  

pexels

 టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావాలు 

 

 సైబర్ బెదిరింపులు -ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా బెదిరింపులు పెరుగుతున్నాయి. టీనేజర్లకు ఇది ఒక సాధారణ సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ బెదిరింపులు బాల్యం, టీనేజర్ బాధితులు 13.99 నుంచి 57.5 శాతం వరకు ఉన్నారు.

pexels

అడాలసెన్స్ లో చూపిన విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహపూర్వకంగా సంభాషణగా మొదలుపెట్టి ఎగతాళి లేదా భావోద్వేగ బెదిరింపుల వరకూ చేరుకుంటుంది. సైబర్ బెదిరింపులను అనుభవించే టీనేజర్లలో మానసిక ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీరు నిరాశ, ఆందోళన, ఆ*త్మహత్య ఆలోచనలు కలిగి ఉండవచ్చని తెలిపారు.  

pexels

భావోద్వేగ సంబంధం లేకపోవడం, ఒంటరితనం 

సోషల్ మీడియా టీనేజర్లపై చూపే ప్రభావాలలో మరొకటి ఆన్‌లైన్ సంభాషణ నిజ జీవిత సంబంధాన్ని తగ్గిస్తుంది. టీనేజర్లు భావోద్వేగాలను నేరుగా వ్యక్తపరచలేకపోతున్నారని వైద్యులు అంటున్నారు. నిరంతరం “కనెక్ట్” అయినప్పటికీ, చాలా మంది టీనేజర్లు భావోద్వేగపరంగా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్నారని అంటున్నారు. 

pexels

శరీరక అందానికి ప్రాధాన్యత  

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు శారీరక రూపానికి గణనీయమైన ప్రాధాన్యతనిస్తున్నాయి. వాస్తవికత లేని అందం ప్రమాణాలను ప్రోత్సహిస్తున్నాయి. టీనేజర్లు తరచుగా ఫిల్టర్ చేసిన, ఎడిట్ చేసిన చిత్రాలకు అట్రాక్ట్ అవుతూ తప్పుడు భ్రమలలో ఉంటున్నారు. శరీర అందానికి ప్రాధాన్యత ఇచ్చేలా టీనేజర్లపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతుంది.   

pexels

ఆందోళన, నిరాశ

సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల టీనేజర్లలో ఆందోళన, నిరాశకు పెరిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. టీనేజర్లు తరచుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రోలింగ్‌లో పాల్గొంటారు. వారు బాడీ షేమింగ్, వ్యక్తిగత సామర్థ్యాలు, భాష, జీవనశైలిపై దృష్టి పెడతారు. ఇవి ఆందోళన, నిరాశ లక్షణాలు, ఒత్తిడికి కారణమవుతాయి.   

pexels

నిద్ర సమస్యలు  

సోషల్ మీడియా టీనేజర్ల నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. టీనేజర్ల ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం.  అయితే అతిగా సోషల్ మీడియా వాడకం వల్ల నిద్రకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల నుంచి వెలువడే నీలి కాంతి  నిద్రను నియంత్రించడానికి అవసరమైన హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. 

pexels

టీనేజర్లపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాలను విస్మరించలేం. తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకుందాం.  

pexels

ఆన్‌లైన్ జీవితం గురించి చర్చ- టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావాలు ఎల్లప్పుడూ కనిపించకపోవచ్చు, కానీ వారి తీరు లేదా స్పందిస్తున్న విధానం ద్వారా తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలతో తరచూ మాట్లాడడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ఆన్‌లైన్ బెదిరింపులు జరిగితే ఎలా వ్యవహరించాలో పిల్లలకు నేర్పించాలి.   

pexels

ఆఫ్‌లైన్ సంభాషణలు - మీ పిల్లలు తమ స్నేహితులతో నేరుగా మాట్లాడేలా ప్రోత్సహించడం, ఆన్ లైన్ చాటింగ్ ల కంటే ఆఫ్ లైన్ సంభాషణలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహించండి. సోషల్ మీడియా బయట సానుకూల సంబంధాలను కలిగి ఉండేలా టీనేజర్లను ప్రోత్సహించండి.   

pexels

మీ పిల్లల సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షించండి - తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా వారు 10 లేదా 14 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, వారి తీరు, పరిపక్వత ఆధారంగా సోషల్ మీడియా ఖాతాలపై పర్యవేక్షణ ఉండండి.   

pexels

 ప్రైవసీ సెట్టింగ్‌లు -మీ పిల్లలు తమ సోషల్ మీడియా ఖాతాలలోని ప్రైవసీ సెట్టింగ్‌లను అర్థం చేసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి. వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవడాన్ని పరిమితం చేయండి. పూర్తి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవద్దని పిల్లలకు నేర్పండి.

pexels

 సరిహద్దులను సెట్ చేయండి - పిల్లలను పూర్తిగా నియంత్రించడానికి బదులుగా, వారికి అర్థమయ్యేలా చెబుతూ...సరిహద్దులను సృష్టించండి. సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు పెట్టండి. స్క్రీన్ సమయాన్ని తగ్గించండి.  

 ఆరోగ్యకరమైన సోషల్ మీడియా అలవాట్లు-  మీ సొంత సోషల్ మీడియా ఖాతాలను సరిగ్గా నిర్వహిస్తూ.... మీ పిల్లలకు టెక్నాలజీ పట్ల సమతుల విధానాన్ని చూపించండి. మీరు కుటుంబంతో గడిపెటప్పుడు మీ ఫోన్‌ను దూరంగా ఉంచండి. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి.  

pexels

గోల్డ్ కలర్ చీరలో ప్రణీత అందాల ధగధగలు: ఫొటోలు

Photo: Instagram