డ్రైఫ్రూట్లను ప్రతీ రోజు తినడం చాలా ముఖ్యం. వీటి కీలకమైన పోషకాలు ఉంటాయి. అయితే, కొన్ని రకాల డ్రైఫ్రూట్లను నానబెట్టుకొని తింటే పోషకాలు శరీరానికి మరింత మెరుగ్గా అందుతాయి.
Photo: Pexels
డ్రైఫ్రూట్లను నానబెట్టడం ద్వారా తినేందుకు అనువుగా ఉండటంతో పాటు సులువుగా జీర్ణమవుతాయి. అలాగే పోషకాలు బాగా శరీరానికి దక్కుతాయి. నానబెట్టుకొని రెగ్యులర్‌గా తినాల్సిన కొన్ని డ్రైఫ్రూట్స్ ఇవే.
Photo: Pexels
నానబెట్టిన బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యమైన విటమిన్స్, మినపల్స్ ఉంటాయి. బ్లడ్‍ప్రజర్‌ను ఇది కంట్రోల్ చేయటంతో పాటు చెడు కొలెస్ట్రాల్‍ను తగ్గించలవు. పూర్తి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Photo: Pexels
ఆక్రోట్లను (వాల్‍నట్స్) నీళ్లలో నానబెట్టడం వల్ల పోషకాల స్థాయి పెరుగుతుంది. ఇవి తింటే మెదడు పనితీరు మెరుగుదల, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడం సహా చాలా లాభాలు ఉంటాయి. విటమిన్ ఈ, బీ5 మెండుగా ఉండడం వల్ల చర్మానికి కూడా చాలా మేలు.
Photo: Pexels
ఫిగ్స్ అనే డ్రైఫ్రూట్‍ను నానబెట్టి తినడం వల్ల పేగులు, కడుపు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కడుపులో మంట, మలబద్దకం సమస్యలు తగ్గేందుకు ఇవి సహకరిస్తాయి.
Photo: Pexels
ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం చాలా మంచిది. రోగనిరోధక శక్తి మెరుగవటంతో పాటు జుట్టు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.