2వ సారి ఐసీసీ ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా స్మృతి మంధాన

By Sanjiv Kumar
Jan 27, 2025

Hindustan Times
Telugu

భారత మహిళల జట్టు ప్లేయర్ స్మృతి మంధాన 2024 క్యాలెండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో అసాధారణ ప్రదర్శన చేసింది. 

ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో. ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా తాజాగా ఎంపికైంది. 

సోమవారం (జనవరి 27) ఐసీసీ ఈ అవార్డును ప్రకటించింది. 

స్మృతి మంధాన వన్డే మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. 

శ్రీలంకకు చెందిన చమరి అథపత్తు, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్, దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్‌లను ఓడించి స్మృతి టైటిల్‌ను గెలుచుకుంది.

ఎడమచేతి వాటం గల స్మృతి 2024లో ఆడిన 13 ఇన్నింగ్స్‌లో 747 పరుగులు చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఆమె చేసిన అత్యధిక స్కోరు ఇదే.

స్మృతి మంధాన 57.86 సగటుతో పరుగులు చేసింది. 95.15 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసింది.

స్మృతి మంధాన 2024లోని వన్డేల్లో నాలుగు సెంచరీలు సాధించింది. మహిళల క్రికెట్‌లో ఇదో కొత్త రికార్డు.

ALL Photo: PTI

కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ ఎందుకు సోకుతుంది? కారణాలు ఏంటీ?

Image Source From unsplash