అరటి పండు తింటే పోషకాల వల్ల ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు జరుగుతుంది. అయితే, అరటితో అందం కూడా మెరుగుపడుతుంది. చర్మం, జుట్టుకు అరటి పండు చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది.
Photo: Pexels
అరటి పండు తింటే చర్మానికి పోషకాలను ఎక్కువగా అందిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారకుండా సహకరిస్తుంది. ఈ పండు రెగ్యులర్‌గా తింటే చర్మపు మెరుపును పెంచగలదు.
Photo: Pexels
అరటి పండులో యాంటీఇన్‍ఫ్లమేషన్ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు నుంచి చర్మాన్ని ఇవి కాపాడగలవు. మచ్చలు, మొటిమలు తగ్గేలా అరటి ఉపయోగపడుతుంది.
Photo: Pexels
అరటి పండులో విటమిన్ ఏ, విటమిన్ సీ మెండుగా ఉంటాయి. చర్మపు బిగుతును ఇవి పెంచగలవు. ముడతలు తగ్గేందుకు తోడ్పడతాయి.
Photo: Pexels
అరటిలో ఎక్కువగా ఉండే పొటాషియం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తం మెరుగ్గా సరఫరా అవుతుంది. దీనివల్ల కుదుళ్లు బలంగా మారి జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. జట్టు రాలడం కూడా తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
అరటి పండులో ఉన్న విటమిన్ సీ వల్ల శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల జుట్టు బలం, మెరుపు అధికం అవుతాయి.
Photo: Pexels
విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.