కండరాల దృఢత్వం, కణాల ఆరోగ్యం, హర్మోన్ల ఉత్పత్తి సహా శరీరంలో మరిన్ని ముఖ్యమైన చర్యలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. అందుకే ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తప్పకుండా రెగ్యులర్‌గా తినాలి. కొన్ని పండ్లలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాంటి ఆరు పండ్లు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
జామపండులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఓ కప్పు జామముక్కల్లో సుమారు 4.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలం.
Photo: Pexels
100 గ్రాముల అవకాడోలో 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.
Photo: Pexels
కివీ పండ్లలోనూ ప్రోటీన్ ఎక్కువే. 100 గ్రాముల కివీల్లో 1.1 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ సీ సహా కీలకమైన పోషకాలు కివీల్లో ఉంటాయి.
Photo: Pexels
ఒక మీడియం సైజ్ అరటి పండులో సుమారు 1.1 నుంచి 1.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పొటాషియం కూడా ఈ పండులో పుష్కలం.
Photo: Pexels
100 గ్రాముల బ్లాక్‍బెర్రీల్లో సుమారు 1.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు కూడా దాదాపు ఇదే రకంగా ప్రోటీన్ కలిగి ఉంటాయి.
Photo: Pexels
దానిమ్మ పండులోనూ ప్రోటీన్ మెండుగా ఉంటుంది. 100 గ్రాముల దానిమ్మ గింజల్లో సుమారు 1.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కీలకమైన విటమిన్స్, మినరల్స్ ఈ పండులో పుష్కలంగా ఉంటాయి.
Photo: Pexels
ఒక్క లైన్తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్లు ఇవి..