బ్లడ్ ప్రెజర్‌ను సహజంగా తగ్గించగల ఆరు రకాల ఫుడ్స్

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 04, 2024

Hindustan Times
Telugu

బ్లడ్ ప్రెజర్ (బీపీ) ఉన్న వారు ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఫుడ్స్ సహజంగా బీపీ తగ్గేందుకు ఉపకరిస్తాయి. వీటిని మీ డైట్‍లో తీసుకోవచ్చు. బీపీని తగ్గించగల ఆరు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

బీట్‍రూట్‍లో నైట్రేట్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే బ్లడ్ ప్రెజర్ తగ్గేందుకు సాయపడుతుంది.

Photo: Pexels

కివీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. బీపీ కంట్రోల్‍లో ఉండేందుకు ఈ ఫ్రూట్ తోడ్పడుతుంది. 

Photo: Pexels

ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది బీపీ తగ్గడంలో సహకరిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఓట్స్ మేలు చేస్తాయి. 

Photo: Pexels

అరటి పండులో పొటాషియం ఉంటుంది. శరీరంలో సోడియం స్థాయిని ఇది నియంత్రిస్తుంది. తర్వాత బ్లడ్ ప్రెజర్‌ను అరటి తగ్గించగలదు. 

Photo: Pexels

స్ట్రాబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే బీపీ అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి.

Photo: Pexels

పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో పొటాషియం, నైట్రేట్స్ మెండుగా ఉంటాయి. రక్తకణాలు రిలాక్స్ అయి బీపీ తగ్గేందుకు ఇవి సహకరిస్తాయి. 

Photo: Pexels

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.

pixabay