గుండె పనితీరుకు మంచి చేసే ఆరు రకాల ఆహారాలు: రెగ్యులర్‌గా తినండి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 25, 2024
Hindustan Times Telugu
మనిషికి ఎంతో ముఖ్యమైన గుండె ఆరోగ్యంగా ఉండడంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. పోషకాలు ఉండే సరైన ఆహారాలు తీసుకుంటే గుండె పనీతీరు, హెల్త్ మెరుగ్గా ఉంటాయి. అలా గుండెకు మంచి చేసే ఆరు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
పాలకూరలోని నైట్రేట్లు రక్తనాళాలకు మేలు చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండెపై ఒత్తిడి తగ్గి పనితీరుకు మంచి జరుగుతుంది. పాలకూరలోని విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
Photo: Pexels
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ లాంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‍ఫ్లమేషన్‍ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Photo: Pexels
అవకాడోల్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‍ను తగ్గిస్తాయి. దీంతో గుండె వ్యాధుల రిస్కును అవకాడో తగ్గిస్తుంది.
Photo: Pexels
టమాటాల్లో లైకోపెన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఆక్సిడేటివ్ డ్యామేజ్‍ను ఇది తగ్గిస్తుంది. గుండె పనితీరును టమాటాలు ఇంప్రూవ్ చేస్తాయి.
Photo: Pexels
సాల్మోన్, టునా లాంటి ఫ్యాటీ చేపలు గుండెకు మేలు చేస్తాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు హార్ట్‌కు చాలా మంచిది.
Photo: Pexels
వాల్‍నట్స్‌లో మెగ్నిషియం, కాపర్, ఫైబర్ సహా ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‍ను ఇవి తగ్గించగలవు. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.