చెవులలో దురద చాలా సాధారణం. అయితే కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు చేసే పనుల కారణంగా చెవి దురద సమస్య తీవ్రతరం అవుతుంది. చెవి దురదకు కారణాలు, ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.   

pexels

By Bandaru Satyaprasad
May 14, 2025

Hindustan Times
Telugu

 అతిగా శుభ్రపరచడం- చెవి సమస్యల్లో సగానికి పైగా అతి శుభ్రం వల్ల వస్తున్నవే అని వైద్యులు చెబుతున్నారు. ఇయర్‌ వ్యాక్స్ మీ చెవులకు వాటర్‌ప్రూఫ్, రక్షణగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. గులిమి క్లీన్ పేరుతో తరచూ చెవులను శుభ్రం చేయడం మంచిది కాదని వైద్యుల సూచన.  

pexels

చెవులను అతిగా శుభ్రపరచడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగినా అది పెద్ద సమస్యలకు దారితీస్తుంది. చెవులలో బడ్స్, చేతి వేళ్లతో క్లీన్ చేస్తే వ్యాక్స్‌ను మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంది. దీంతో చెవిలో గులిమి పేరుకుపోవడానికి దారితీస్తుంది.  

pexels

గులిమి పేరుకుపోవడం- చెవి దురద తరచుగా వ్యాక్స్ పేరుకుపోవడానికి లక్షణం. చెవి పోటు, చెవి నుంచి వాసన.. సంకేతాలుగా గమనించవచ్చు. మనలో చాలామందికి చెవులను శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇయర్‌వ్యాక్స్ సాధారణంగా చెవి నుండి దానంతట అదే బయటకు వస్తుంది. స్నానం చేసేటప్పుడు చెవి బయట భాగాన్ని కడగవచ్చు.  

pexels

చర్మ లక్షణాలు- తామర, సోరియాసిస్ వంటి చర్మ సంబంధమైన పరిస్థితులు చర్మంలోని పలు చోట్ల కనిపిస్తాయి. ఇవి దురదను కలిగిస్తాయి. చెవిలో మిగిలిన భాగాల మాదిరిగానే చర్మంతో కప్పబడి ఉంటుంది.  తామర, సోరియాసిస్ చెవిలో కూడా కనిపించవచ్చు. తామర, సోరియాసిస్ తో బాధపడుతున్న వారికి చెవులు దురద పెడితే వైద్యుడిని సంప్రదించండి.   

pexels

చెవి ఇన్ఫెక్షన్లు -చెవి ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణం దురద. చెవిలో నొప్పి లేదా చెవి నుండి స్రావాలు వస్తున్నట్లయితే వైద్యుడిని తప్పనిసరిగా సంప్రించండి.  ఇవి మీ చెవులకు హాని కలిగించే లేదా వినికిడికి హాని కలిగించే ఇన్ఫెక్షన్ కు సంకేతాలు కావొచ్చు. హియరింగ్ ఎయిడ్స్ లేదా ఇయర్‌ బడ్స్ ఉపయోగించే వారు కొన్నిసార్లు చెవి ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.   

pexels

 ఫుడ్ అలెర్జీలు -  ఆహార అలెర్జీలు మీ చెవులను దురద పెట్టించవచ్చు. పుప్పొడి అలెర్జీ ఉంటే సోయా, గోధుమలు, పాలు, చేపలు, షెల్ ఫిష్ వంటి ఆహారాలు తిన్న తర్వాత చెవులు దురద పెడతాయి.    

pexels

 ఓరల్ అలెర్జీ సిండ్రోమ్ అని పిలువబడే పుప్పొడి అలెర్జీ ఉంటే, ఆపిల్, పుచ్చకాయలు, అరటిపండ్లు, చెర్రీస్, కివీస్ , పొద్దుతిరుగుడు విత్తనాలు, హాజెల్ నట్స్, బాదం వంటి ఆహారాలు తిన్న తర్వాత మీ చెవుల్లో దురద అనిపించవచ్చు. ఏదైనా ఆహారం తిన్న తర్వాత మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే చికిత్స పొందాలని గుర్తుంచుకోండి.

pexels

 ఆభరణాల వల్ల చికాకు - చెవిపోగులు, ఇతర నగలు తయారు చేయడానికి ఉపయోగించే నికెల్ వంటి కొన్ని లోహాలకు చెవిలో దురదకు కారణం కావొచ్చు.  నికెల్ అత్యంత సాధారణ చర్మ అలెర్జీ కారకాల్లో ఒకటి. మీకు నికెల్ అలెర్జీ ఉంటే, చెవి దురద, ఎరుపు, మచ్చలు లేదా వాపును కలగవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా 12 నుంచి 48 గంటల వరకు ఉంటాయి.

pexels

చెవి దురద తాత్కాలికంగా ఉంటుంది. దానంతట అదే తగ్గిపోతుంది. మీ దురద కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే లేదా మీకు ఇతర లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.   

pexels

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash