మనం తరచుగా శుభ్రం చేయకూడని 6 శరీర భాగాలు

pexels

By Bandaru Satyaprasad
May 11, 2025

Hindustan Times
Telugu

సాధారణంగా మనం రోజులో కనీసం రెండు సార్లు స్నానం చేస్తుంటాం. శరీర భాగాలన్నింటినీ క్లీన్ చేసుకుంటుంటాం. అయితే మన శరీరంలోని ఈ 6 భాగాలను ఎంత తక్కువగా క్లీన్ చేసుకుంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.   

pexels

చనిపోయిన చర్మ కణాలు- రోజుకు రెండుసార్లు ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. కానీ తరచుగా ముఖాన్ని స్క్రబ్ చేస్తే చర్మాన్ని ఎక్కువగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీంతో చర్మంలోని సహజ నూనెలను తొలగించి, మొటిమలకు కారణమవుతుంది. మృత చర్మ కణాలను తొలగించడానికి వారానికి రెండుసార్లు మాత్రమే ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.   

pexels

చెవులు- ఇయర్‌వాక్స్ మీ చెవులను శుభ్రం చేస్తుంది. ధూళి, చెత్తను సేకరించి గులిమి రూపంలోని వాటిని బయటకు తీస్తుంది. చెవిలోని గులిమి క్లీన్ చేసేందుకు బడ్స్ లేదా ఇతర పరికరాలు ఉపయోగించడం అంత మంచిదికాదు. కాటన్ స్వాబ్‌లు, వేళ్లు, ఇతర వస్తువులను మీ చెవి నుంచి దూరంగా ఉంచండి.   

pexels

జుట్టు -మీరు తలస్నానం చేసిన ప్రతిసారీ షాంపూ వాడడం అలవాటు చేసుకుని ఉంటారు. అధికంగా షాంపూతో తలస్నానం చేస్తే మీ జుట్టులోని సహజ నూనెలు తగ్గిపోయి, పొడిగా కనిపిస్తుంది. అందుకే షాంపూ వినియోగాన్ని తగ్గిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.  

pexels

 ముక్కు- మీరు తరచుగా ముక్కును క్లీన్ చేసుకుంటుంటే... ఆ అలవాటు మానుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముక్కును వేలుతో క్లీన్ చేస్తే స్క్నోజ్ లోపల చిన్న గీతలు ఏర్పడతాయి. కొంత రక్తం బయటకు వచ్చి సూక్ష్మక్రిములకు ఆహారంగా మారుతుంది. ఇది ముక్కు లోపల క్రస్ట్, చికాకును పెంచుతుంది.

pexels

గట్ - మీ శరీరంలోని కాలేయం, మూత్రపిండాలు, పెద్దపేగులోని చర్యల ద్వారా డీటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. పెద్దపేగులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా డీటాక్సిఫికేషన్ కు సహాయపడుతుంది.  మీ పొట్టను క్లీన్ చేసేందుకు ఎలాంటి ఇతర విధానాలు పాటించాల్సిన అవసరంలేదు.  

pexels

యోని- యోని నుంచి వచ్చే వాసన మీకు అసౌర్యంగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి యోనిని అధికంగా శుభ్రం చేయడం వల్ల పీహెచ్ స్థాయిలు తగ్గిపోయాయి.  సాధారణంగా యోనిని శుభ్రం చేయడానికి సాధారణ నీరు సరిపోతుంది. సబ్బును ఉపయోగించాలనుకుంటే సున్నితంగా రాసుకోవాలి.  

pexels

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

Photo Credit: Pexels