ఆహారం, పాలు, పెరుగు, మాంసం, కూరగాయలు, పండ్లను పాడుకాకుండా నిల్వ చేయడానికి అందరూ ఆధారపడేది రిఫ్రిజిరేటర్ పైననే. అలాంటి ఫ్రిజ్ ఓపెన్ చేయగానే దుర్వాసన వస్తుంటే ఎలా ఉంటుంది?
By Sudarshan V May 16, 2025
Hindustan Times Telugu
ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..
రెగ్యులర్ గా ఉపయోగిస్తాం కాబట్టి, ఫ్రిజ్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. తడి గుడ్డ లేదా టిష్యూ పేపర్ తో తుడవకూడదు.
రిఫ్రిజిరేటర్ ను క్లీన్ చేసే లిక్విడ్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. లేదా వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి వాడవచ్చు.
ఫ్రిజ్ ను శుభ్రం చేసిన తర్వాత కరివేపాకు, నిమ్మకాయ, లవంగాలను లోపల ఓపెన్ గా భద్రపరుచుకోవచ్చు.వాటి వల్ల ఫ్రిజ్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి దుర్వాసన ఉండదు.కీటకాలు కూడా వాటి వాసనకు దూరంగా ఉంటాయి.
కంటైనర్లలో నిల్వ చేయడం వల్ల దుర్వాసనను కొంతవరకు నివారించవచ్చు. అలాగే, వండిన ఆహారాలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి.
ఫ్రిజ్ నుంచి దుర్వాసన పోవాలంటే వెనిగర్ ను నీటిలో మరిగించి నాలుగు నుంచి ఆరు గంటల పాటు ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి. ఈ ద్రావణం అన్ని వాసనలను గ్రహిస్తుంది.
ఫ్రిజ్ ను శుభ్రం చేసిన తర్వాత కాటన్ బాల్స్ ను మార్కెట్ లో దొరికే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ లో ముంచి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిజ్ ను మంచి వాసనతో నింపుతుంది.
భరించలేని ఒత్తిడిని కూడా తగ్గించే అద్భుత ఆహారాలు ఇవి..