శరీరం లోపల విటమిన్ల లోపం ఉంటే- బయటకు కనిపించే సంకేతాలు ఇవి..

pexels

By Sharath Chitturi
Jun 03, 2025

Hindustan Times
Telugu

మనిషి బతకడానికి విటమిన్లు చాలా అవసరం. కానీ జీవనశైలితో పాటు అనేక కారణాలతో విటమిన్ల లోపం ఎదురవుతోంది. లోపం ఉంటే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది.

pexels

విటమిన్​ సీ లోపం ఉంటే శరీరం బలహీనంగా అనిపిస్తుంది. చిగుళ్లల్లో రక్తస్రావం జరుగుతుంది. వేగంగా కోలుకోలేరు.

pexels

విటమిన్​ బీ12 లోపంతో ఒక్కోసారి నరాలు దెబ్బతినొచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరగొచ్చు. 

Unsplash

విటమిన్​ డీ లోపంతో ఎముకలు బలహీన పడిపోతాయి. చిన్న పని చేసినా అలసిపోతుంటారు.

pexels

విటమిన్​ ఏ లోపంతో కంటి చూపు మందగిస్తుంది. చర్మం డ్రై అయిపోతుంది.

pexels

అవయవాలు తరచూ తిమ్మిరిగా అవుతుంటే విటమిన్​ ఈ లోపం ఉండే అవకాశం ఉంది.

pexels

విటమిన్లు పెంచుకునేందుకు సరైన ఆహారం తినాలి. డైట్​లో గుడ్లు, డ్రై ఫ్రూట్స్​, ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్​ వంటివి ఉండేలా చూసుకోవాలి.

pexels

చేదు అని వదిలేయకండి...! కాకరకాయలో బోలెడు పోషకాలు

image credit to unsplash