శని మనకు ప్రతికూలంగా ఉన్నాడని చుట్టూ జరిగే పరిస్థితులే తెలిసేలా చేస్తాయి. అవి తెలుసుకోగలిగి పరిహారం చేసుకుంటే సజావుగా గడిపేయొచ్చు.

istock

By Ramya Sri Marka
Dec 06, 2024

Hindustan Times
Telugu

గోడలకు పగుళ్లు రావడం: ఇంట్లో తరచూ గోడలకు పగుళ్లు కనపడటం ఇంట్లో కలహాలు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం. ఇది కూడా శనిదేవుని అసంతృప్తికి గురి చేస్తుంది.

PIxabay

ఇంట్లో బూజు: ఇంట్లో బూజును శుభ్రం చేస్తున్న కొద్దీ మళ్లీ మళ్లీ వస్తుందంటే అది శని దేవుడి ఆగ్రహానికి సంకేతం.  ఇది ఇంట్లో దు:ఖం, విచారాన్ని పెంచుతుంది.  దాపరిస్తాయి. ఇంట్లో పాజిటివిటీ, సంతోషం కనిపించాలంటే శుభ్రతగా కచ్చితంగా పాటించాలి. 

PIxabay

చీమలు: ఇంట్లోకి చీమలు అకారణంగా వస్తూ ఉంటే కాస్త అనుమానించాల్సిన విషయమే. ఇది కూడా శనిదేవుడు మీపై అసంతృప్తిగా ఉన్నాడనే దానికి సంకేతం.

PIxabay

నల్ల పిల్లి: మీ ఇంటి పరిసరాల్లో నల్ల పిల్లి మకాం వేసిందంటే అది శనిదేవుడు ఆగ్రహంగా ఉన్నాడనే దానికి సంకేతం. వెంటనే దానికి సంబంధించిన పరిహారాలు పాటించి, దుష్ట శక్తుల్ని తరిమికొట్టండి.

PIxabay

కోర్టు కేసుల్లో ఓటమి: చట్టపరమైన విషయాల్లో తరచూ ఓటమి ఎదురవుతుందా.. కర్మపరమైన విషయాల్లో శనిదేవుని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. నిజాయతీగా ఉంటేనే మీకు న్యాయం వర్తిస్తుంది.

PIxabay

సమస్యలు పెరుగుతూనే ఉన్నాయా: మీరు ఒక సమస్యను పరిష్కరించారని అనుకునేలోపే మరో సమస్య వెంటాడుతుంటే ఇది శనిదేవుని ప్రభావమే. గతంలో మీరు చేసిన పనులను ఒకొక్కటిగా మీ కళ్ల ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని ధర్మంగా వ్యవహరించాలని గుర్తు చేస్తున్నాడని తెలుసుకోండి. శనిదేవుని ఆరాధించి పరిహారాల్ని పొందండి.

PIxabay

పని ప్రదేశంలో సమస్యలు: మీ పై అధికారులతో వరుసగా సమస్యలు ఎదుర్కొంటున్నారా.. మిమ్మల్ని సమస్యలతో శనిదేవుడు పరీక్షిస్తున్నాడని తెలుసుకోండి. సహనంతో పాటు క్రమశిక్షణతోనూ పనిని పూర్తి చేయడం నేర్చుకోండి.

PIxabay

ప్రార్థనతోనే ఉపశమనం శనిదేవుడు కర్మ ఫలితాలను, న్యాయ పాలనను పాటించే వాళ్లకు అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఒకవేళ తప్పు చేసినా హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో మన్నింపు కోరిన వారిని క్షమిస్తాడు. ఇలా చేయడం వల్ల దుష్కర్మల ఫలితం తగ్గి మీపై శని దేవుని దీవెనలు ఉంటాయి.

PIxabay

బరువు తగ్గేందుకు ఈ జ్యూస్.. ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు!

Photo: Pexels