రాత్రి వేళలో యాపిల్ తింటే ఈ ఇబ్బందులు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 15, 2024

Hindustan Times
Telugu

ప్రతీ రోజు ఒక యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పండులో విటమిన్స్, మినరల్స్ మెండుగా ఉంటాయి. అయితే, యాపిల్‍ను పడుకునే ముందు రాత్రి వేళ తింటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 

Photo: Pexels

యాపిల్‍లో ఫ్రక్టోస్, షుగర్ ఉంటాయి. దీంతో యాపిల్‍ను రాత్రి వేళ తింటే బాడీ యాక్టివ్‍గా ఉంటుంది. దీంతో నిద్ర సరిగా పట్టదు.

Photo: Pexels

యాపిల్ పండులో మ్యాలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఇది నెమ్మది చేస్తుంది. అందుకే రాత్రివేళ యాపిల్ తింటే ఆహారం జీర్ణం అయ్యేందుకు ఇబ్బందిగా ఉంటుంది. 

Photo: Pexels

యాపిల్‍ను రాత్రి భోజనం తర్వాత తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది.

Photo: Pexels

యాపిల్‍లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతీ రోజు రాత్రిళ్లు యాపిల్ పండు తినడం వల్ల మలబద్దకం సమస్య పెరిగే రిస్క్ కూడా ఉంటుంది. 

Photo: Pexels

యాపిల్‍ను పగటి పూట ఎప్పుడైనా తినొచ్చు. రోజుకో యాపిల్ తినడం చాలా మంచిది. సూర్యాస్తమయానికి ముందే ఈ పండును తినడం ఉత్తమం. 

Photo: Pexels

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay