లైంగిక ఆరోగ్యం అనేది కూడా మీ మానసిక, శారీరక ఆరోగ్యంలాంటిదే. చాలా కాలంపాటు దానిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు
pexels
By Hari Prasad S Feb 14, 2025
Hindustan Times Telugu
లైంగిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ శృంగారానికి చాలా కాలం దూరంగా ఉంటే ఒత్తిడి, యాంగ్జైటీలాంటి కలుగుతాయి. ఇది మీ మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది
pexels
లైంగిక ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే అది మెదడుపై ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది
pexels
లైంగిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దంపతుల మధ్య బంధం కూడా క్రమంగా తగ్గిపోతుంది. శారీరక దూరం ఇద్దరి మధ్య మానసిక దూరానికి కూడా కారణమవుతుంది
pexels
లైంగిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది రోగ నిరోధక వ్యవస్థనూ బలహీనపరుస్తుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. శారీరక సామర్థ్యం తగ్గిపోతుంది
pexels
యోనిలోనూ సమస్యలు ఏర్పడతాయి. యోని పొడిగా మారి అసౌకర్యంగా అనిపిస్తుంది. యోని గోడలు పలుచగా మారతాయి. నొప్పి, చికాకు కలుగుతుంటాయి
pexels
లైంగిక ఆరోగ్యాన్ని చూసుకోకపోతే అది ప్రొస్టేట్ క్యాన్సర్‌కూ దారి తీస్తుంది. క్రమం తప్పకుండా వీర్యస్కలనం అనేది ప్రొస్టేట్ పనితీరును మెరుగుపరుస్తుంది
pexels
లైంగిక చర్యల వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్ల కోసం ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే ఇది భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది
pexels
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు